పేరుకే అగ్ర రాజ్యం.. ! ఆర్థిక పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే?

Chakravarthi Kalyan

అగ్ర రాజ్యం అమెరికా ఆర్థిక పరిస్థితిపై ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా అమెరికా దేశ బడ్జెట్ లోటు గరిష్ఠాలకు చేరుకుందని చెబుతున్నారు.  ఈ క్రమంలో... సెప్టెంబర్ 30 నాటికి ఇది 1.83 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతక ముందు గరిష్టంగా 2020-21 కొవిడ్ సమయంలో... 1.7 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది.


అవును... ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికా ఆర్థిక లోటూ పెరిగిందని.. ఇది సెప్టెంబర్ 30 నాటికి 1.83 ట్రిలియన్ డాలర్లుగా ఉందని చెబుతున్నారు. గతంలో 2020-21 సమయంలో గరిష్టంగా ఇది 1.7 ట్రిలియన్ డాలర్లుగా ఉండేదని అంటున్నారు. ఈ మేరకు యూస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈ విషయాలు వెల్లడించింది.

అప్పుల వడ్డీతో పాటు బైడెన్ ప్రభుత్వ ప్రతిపాదనలతో యూఎస్ అత్యున్నత న్యాయస్థానం విద్యార్థుల రుణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం దీనికి ప్రధాన కారణం అని యూఎస్ ట్రెజరీ విభాగం చెబుతుంది! అయితే... ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ (ఫెడ్) ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఈ లోటు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.


ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ యుద్ధ భయాల నేపథ్యంలో యూఎస్ ఆర్థిక లోటు. 2023లో స్థూల దేశీయోత్పత్తిలో 6.2 శాతంగా ఉండగా.. 2024 సెప్టెంబర్ నాటికి 6.4 శాతానికి చేరింది. ఇదే సమయంలో... 2023తో పోలిస్తే ఈ ఏడాది వడ్డీ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఇందులో భాగంగా... గత ఏడాది కంటే $254 పెరిగి $1.1 ట్రిలియన్ అయ్యిందని చెబుతున్నారు.


ఇదే సమయంలో... చాలా మంది ఆర్థిక వేత్తల అభిప్రాయాల ప్రకారం.. కమలా హారిస్ ఆర్థిక ప్రణాళిక ఒక దశాబ్ధంలో రుణాన్ని $3.5 ట్రిలియన్లకు పెంచుతుందని.. ఇక, ట్రంప్ దానిని $7.5 పెంచుతారని కమిటీ ఫర్ ఎ రెస్పాన్సిబుల్ ఫెడరల్ బద్జెట్ అంచనా వేసింది. అయితే.. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఈ లోటు నుంచి కొంత ఉపశమనం పొందొచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: