బీఆర్ఎస్‌లో కేసీఆర్ పేరు మాయం... పార్టీలో ఏం జరుగుతోంది...!
ఈ ఫొటో ఎప్పుడు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో వెంటనే బీఆర్ ఎస్ పార్టీని పూర్తిగా కేటీఆర్ టేకోవర్ చేసుకున్నారన్న సంకేతాలను పంపుతున్నారన్న గుసగుసలు బీఆర్ ఎస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లోగో లో ఒకప్పుడు కేసీఆర్ మాత్రమే కనిపించేవారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ఫోటో కనిపిస్తోంది. గతంలో పార్టీలో ఎవరి నోట ఏ ప్రస్తావన వచ్చినా కూడా అసెంబ్లీకి టైగర్ వస్తుందని కేసీఆర్ గురించి చెప్పేవారు.
ఇప్పుడు అసలు కేసీఆర్ ప్రస్తావన కేటీఆర్ అస్సలు చేయడం లేదంటున్నారు. ఈ విషయం పార్టీ వర్గాల్లోనే చర్చకు వస్తోంది. మూసీ వ్యవహారంలో గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమైనప్పుడు కేసీఆర్ వస్తేనే బాగుంటుందని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అస్సలు కేటీఆర్ ఆ టాపిక్ కూడా రానివ్వ లేదని.. కేసీఆర్ గురించి ఎవ్వరి నోటా మాట కూడా వచ్చేందుకు ఇష్టపడలేదని టాక్ ? ఇక ప్రస్తుతం పార్టీ లో జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటించారని బీఆర్ఎస్ వర్గాలు చాలా సందేహిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫలితాల తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బయటకు వచ్చినా ... ఆ తర్వాత అసలు బయటకు రావడంలేదు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాలు కూడా పెట్టే పరిస్థితి లేదు. కవిత కూడా జైలు నుంచి వచ్చాక బాగా సైలెంట్ అయ్యారు. ఏదేమైనా బీఆర్ ఎస్‌లో కేసీఆర్ హవా తగ్గి.. కేటీఆర్ శకం పూర్తిగా స్టార్ట్ అయిపోయినట్టే.