మోడీ మహాటీంలో జనసేనానికి ప్రత్యేక స్థానం... ప్లాన్ అదేనా?

Suma Kallamadi
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ - ప్రధానమంత్రి మోడీకి ఉన్న రిలేషన్ గురించి జనాలకు తెలియంది కాదు. తెలుగుదేశం కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమం పవన్ ఉత్తమ మంత్రిగా కూడా గుర్తింపు సాధించాడు. సమస్య తలెత్తగానే పవన్ స్పందిస్తున్న తీరుని చూసి దేశం ఆశ్చర్యపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు సనాతన ధర్మం విషయంలో తప్పులు జరిగినపుడు పవన్ స్పందిస్తున్న తీరు న భూతో న భవిష్యతి. ఈ క్రమంలోనే పవన్ మోడీ, అమిత్ షాలని బాగా ఆకట్టుకున్నాడు. ఈ విషయంలో ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా పవన్ తనదైన రీతిలో సనాతన ధర్మం పట్ల వ్యవహరించిన తీరు విమర్శకులను సైతం మెప్పిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.
కాగా ఇపుడు పవన్ మోడీ, అమిత్ షా టీంలో భాగం అయ్యారా? అనే ప్రచారం నడుస్తోంది. హిందూ ఇజానికి ప్రాణం ఇచ్చే బీజేపీకి అనుగుణంగా పవన్ మాట్లాడడంతో వామపక్షాలు ఇదే విషయాన్ని తెరమీదకి తెస్తూ, విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు, బీజేపీకి పవన్ మీద మరింత గురి కుదిరింది అని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీకి ఎన్డీయేలో ఎందరో మిత్రులు ఉన్నారు. కానీ బీజేపీ ఫిలాసఫీకి మద్దతుగా నిలిచే పార్టీలు అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. గతంలో శివసేన ఉండేది. కానీ ఆ పార్టీ గత అయిదేళ్లుగా బీజేపీకి ఎదురు నిలిచి ఇండియా కూటమిలో ఉంటోంది. ఇటువంటి తరుణంలో శివసేన ప్లేస్ ని జనసేన భర్తీ చేస్తుందా అన్న చర్చ సాగుతోంది.
ఇకపోతే, మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం అనే సంగతి విదితమే. ఈసారి బీజేపీ ఇక్కడ గెలవకపోతే చాలా తేడా వచ్చేస్తుంది. దాంతో సర్వ శక్తులను అక్కడ ఒడ్డుతున్న బీజేపీ తన వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలు అన్నీ ప్రయోగించడానికి సిద్ధపడింది. నవంబర్ 20న జరిగే ఈ ఎన్నికలకు అట్టే సమయం కూడా లేదు కాబట్టి చాలా వినూత్నంగా ఈసారి యుద్ధబరిలో దిగడానికి బీజేపీ సన్నద్ధం అయింది. దాంతో భారీ ఎత్తున ప్రచారం చేపట్టడానికి బీజేపీ మోడీ టీం ని తయారు చేశారు అని అంటున్నారు. ఈ టీములో ఉద్ధండులు అయిన బీజేపీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కీలక నేతలు ఎంతో మంది పాల్గొనున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ ని కూడా తమ టీం లోకి తీసుకున్నారు టాక్ వినబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: