కాంగ్రెస్ పార్టీకో దండం రా బాబు..జీవన్ రెడ్డి రాజీనామా ?
ఉదయం 8 గంటలకు.. జనాలంతా చూస్తున్న తరుణంలోనే.. బైక్ పై వెళ్తున్న జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని... కారులో వచ్చి.. సంతోష్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మారన ఆయుధాలతో దాడి చేసి పారిపోయాడు... కత్తులతో గట్టిగానే పోవడంతో... జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ హత్య విషయం తెలియగానే వెంటనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
గంగారెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం కూడా తెలిపాడు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు జీవన్ రెడ్డి. హత్య చేసిన సంతోష్ ను వెంటనే అరెస్టు చేయాలని.. అతనిపై శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగాడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం పైన మండిపడ్డారు జీవన్ రెడ్డి. గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్లో ఎందుకు చేర్చుకుంటున్నారని నిలదీశారు.
సంజయ్ కుమార్ కు చెందిన.. సంతోష్ ఇటీవల కాంగ్రెస్ లో చేరి... తన అనుచరుడు గంగారెడ్డిని హత్య చేశాడని ఆరోపణలు చేశారు జీవన్ రెడ్డి. అనవసరంగా పార్టీ ఫిరాయింపులకు తెరలేపి... కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరించడం దారుణం అన్నారు. దీనివల్ల తమ అనుచరుడు ప్రాణాలు కోల్పోయాడని కూడా వివరించారు. ఇక దీనిపై కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ ఫోన్ చేస్తే కూడా.... సరిగా రెస్పాండ్ కాలేదు జీవన్ రెడ్డి. ఫోన్ పక్కకు పడేసి... పార్టీకి మీకో దండం అంటూ... ఆగ్రహించారు.