ఇక వైసీపీలో నెంబర్ 2 ఆయనే... గేమ్ మారింది...!
- 2029 ఎన్నికల నాటికి కీ రోల్
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) . .
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఓడలు బండ్లు అవుతున్నాయి. బండ్లు ఓడలవుతున్నాయి. కాలం కలిసి వస్తే అందరం ఎక్కుతుంటారు.. కాలం కలిసి రాకపోతే కిందకు పడిపోతూ ఉంటారు. కొందరు రాజకీయ నాయకులు అయితే సాధించాలన్న పట్టుదల ఉంటే ఏ స్థాయికి అయినా ఎదగవచ్చని నిరూపించుకుంటున్నారు. అలా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరూపించుకుంటున్నారు. వైసీపీలో రోజురోజుకు చెవిరెడ్డి అత్యంత కీలకమైన నాయకుడుగా ఎదుగుతున్నారు.
మామూలుగా వైసీపీలో ఎవరికైనా జగన్‌తో మాత్రమే అనుబంధం ఉంటుంది. కానీ.. చెవిరెడ్డికి మాత్రం వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల అభిమానం కూడా ఉంది. పార్టీలో చెవిరెడ్డి ఎదుగుదల చాలామందికి అసూయ కలిగే ఉందని అంటున్నారు. చెవిరెడ్డి ఒక్కో మెట్టు ఎక్కుతూ వైసిపిలో నెంబర్ 2 పోజిషన్‌కు చేరుకున్నారని.. ఇప్పుడు పార్టీ వర్గాల ప్రచారం జరుగుతుంది. చెవిరెడ్డి రాజకీయ ప్రస్థానంపై వైసీపీ వాళ్లే అసూయ పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2 ఎవరు అంటే వై.వి.సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పేర్లు ఎక్కువగా వినిపించేవి.
అయితే పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక.. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు నుంచి పార్టీలు చెవిరెడ్డి ప్రయారిటీ బాగా పెరుగుతూ వస్తోంది. అందుకే చెవిరెడ్డి తన కొడుకుకి చంద్రగిరి అసెంబ్లీ సీట్‌తో పాటు.. తనకు ఒంగోలు ఎంపీ సీట్లు కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక వైసీపీలో అత్యంత కీలకమైన నేతగా ఎదగడంతోపాటు.. జగన్‌కు మరింత కావలసిన నేతగా ఎదిగాలని అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి వైసిపిలో చెవిరెడ్డి అత్యంత బలమైన నేతగా నెంబర్ 2 పొజిషన్లో ఉంటారని పార్టీలో చర్చ నడుస్తోంది.