ప‌వ‌న్‌ను ఓడించిన ఎమ్మెల్యే అదే జ‌న‌సేన‌లోకి జంప్‌...!

RAMAKRISHNA S.S.
రాజకీయాలు అంటేనే ఎత్తులు పైత్తులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ రోజు ఒక పార్టీలో ఉన్న నేత రేపు మరో పార్టీలో ఉంటారు .. ఎల్లుండి మరో పార్టీలో ఉంటారు. ఇక అందులోను ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే జనసేన అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఓడించిన ఎమ్మెల్యే ఇప్పుడు తిరిగి అదే జనసేన గూటికి చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భీమవరం నియోజకవర్గంలో జరిగిన త్రిముఖ పోరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై 8,357 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్ పార్టీ మారుతున్నారంటూ ఒక్క‌టే ప్రచారం న‌డుస్తోంది. తాజాగా ఆ ప్రచారానికి బలం చేకూర్చే ఘటన ఒక‌టి జ‌రిగింది. 2024 ఎన్నికల ప్రచారం టైంలో  జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ రీల్ హీరో అయితే .... శ్రీను రియల్ హీరో అంటు జగన్ పైకి లేపిన మాజీ ఎమ్మెల్యే వైసీపీకి టాటా చెప్పేస్తున్నార‌ట‌.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే 2019లో ప‌వ‌న్ పై గెలిచిన గ్రంథి శ్రీనివాస్ త‌న‌కు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ఏ ప‌ద‌వి ఇవ్వ‌లేదు. శ్రీను మామూలు ఎమ్మెల్యే గా మిగిలిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అనంతరం గ్రంధి శ్రీను పార్టీ ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. ఆయ‌న పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దురంగా ఉంటున్నారని.. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు మాజీ మంత్రులు సైతం ఆయన ఇంటికి వెళ్లారని తెలుస్తోంది. కారుమూరి నాగేశ్వ‌ర‌రావు .. పేర్ని నాని సైతం ఆయ‌న ఇంటికి వెళ్లార‌ని.. అలాగే ఆయ‌న‌ను తిరిగి పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్ కావాల‌ని కూడా సూచించార‌ని టాక్ ? ఇక గ్రంధి శ్రీను పార్టీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఆయనపై ఓ వర్గం ప్రజానికం నుంచి ప్రెజ‌ర్ ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: