జాయ్‌ జెమీనా హనీట్రాప్‌లో కూటమి ఎమ్మెల్యే.. ఏ పార్టీకి చెందిన వారంటే..?

Suma Kallamadi

ఈరోజుల్లో కొందరు లేడీలు ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో వలపు వల విసురి అందరినీ దోచేస్తున్నారు. వారి మాయ మాటలు నమ్మితే అంతే సంగతులు అని చెప్పుకోవచ్చు. వీరు ఎంత తెలివిగా మాట్లాడుతారంటే ఎంత తెలివైనోళ్ళైనా సరే వీరి బుట్టలో పడాల్సిందే. ఈ కిలేడీలు ఎమోషనల్ గా దగ్గర అయ్యి వారిని మోసం చేస్తారు. ముందుగా మేసేజ్లతో ముగ్గులోకి దించి ఆపై పర్సనల్గా మీట్ అవుదామని కోరతారు. టెంప్ట్ అయి వారిని కలిస్తే దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఇలాంటి వారిలో బాగా ముదిరిన ఒక కిలేడీ పోలీసులకు దొరికిపోయింది.
ఈమె పేరు జాయ్‌ జెమీనా. విశాఖలో హనీట్రాప్‌నకు పాల్పడింది. ఎందరినో వేధించి చివరికి పోలీసులకు దొరికిపోయింది. ప్రస్తుతం ఆమె కస్టడీలో ఉంది. కంచరపాలెం పోలీసులు ఆమెని ప్రశ్నిస్తున్నారు. మత్తు మందులు కూడా ఆమె దగ్గర ఉండటం వల్ల తనకు అవి ఎవరిచ్చారు అని క్వశ్చన్ చేస్తున్నారు. జెమినా ఫోన్‌ లాక్‌ ఓపెన్ చేసి ఎవరెవరు ఆమె ట్రాప్‌లో చిక్కుకుపోయారో తెలుసుకుంటున్నారు. ఈమె బెదిరింపులు, వేధింపులకు తట్టుకోలేక చాలామంది బాధితులు రాష్ట్రాలు వదిలి పారిపోయినట్లుగా కూడా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే జాయ్‌ జెమీనా వలలో ఒక కూటమి ఎమ్మెల్యే కూడా చిక్కుకున్నాడని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కూటమి అంటే టిడిపి, జనసేన, బిజెపి ఈ మూడు పార్టీలు కలిసి ఉంటుంది. మరి ఈ మూడు పార్టీలలో ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈమె హనీ ట్రాప్ లో పడ్డారు అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. అసలు ఇందులో నిజమెంతో కూడా తెలియాల్సి ఉంది. అయితే ఆ ఎమ్మెల్యే పేరు బయట పెడితే ఆయన పరువు పోతుందని, అందుకే అతని పేరును బయటకు రాకుండా సీక్రెట్ గా పోలీసులు ఉంచుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు ఆమెను ఇప్పటికే రెండుసార్లు కస్టడీలో తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. అయినా సరే ఆమె వివరాలను వెల్లడించడానికి నిరాకరిస్తుంది. ఆమె వెనక ఏదైనా గ్యాంగ్ ఉందా అనేది తెలుసుకోవడానికి కూడా చాలా ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. చివరికి ఈ కిలేడీ చేత ఎలాంటి నిజాలు బయట పెట్టిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: