జగన్ పై విమర్శలతో షర్మిల సాధించేది శూన్యమా.. మళ్లీ సీఎం అయితే చుక్కలే!
షర్మిల చిన్నచిన్న తప్పులు చేస్తూ పొలిటికల్ కెరీర్ ను పూర్తిస్థాయిలో నాశనం చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందనే ప్రశ్నకు షర్మిల దగ్గర సరైన జవాబు లేదు. చంద్రబాబుతో తనకు సంబంధం లేదని షర్మిల చెబుతున్నా ఆ మాటలను ఎవరూ నమ్మడం లేదు. జగన్ సైతం షర్మిల విషయంలో సీరియస్ గా ఉన్నారు.
తరచూ విమర్శలు చేస్తూ ఫ్యామిలీని నవ్వులపాలు చేసే విధంగా షర్మిల తీరు ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల రాజకీయాల్లో ఎప్పటికీ ఒంటరేనని తెలంగాణలో సక్సెస్ కాని షర్మిల ఏపీలో కూడా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల ప్రవర్తన శృతి మించిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
షర్మిల సెంటిమెంట్ పండించాల్సిన అవసరం ఏముందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. షర్మిల ఇప్పుడే షేర్ల బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చిందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. షర్మిల గురించి అనుకూల పరిస్థితులు ఏ మాత్రం లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల ఇతర రాజకీయ నేతల ప్రయోజనం కోసం పని చేస్తున్నట్టు అనిపిస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. షర్మిల మాత్రం తనపై వస్తున్న విమర్శల గురించి తెలివిగా స్పందిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో షర్మిల తీరులో మార్పు రావాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.