వైసీపీకి మాజీ మంత్రి గుడ్ బై... జగన్కు అక్కడ పెద్ద షాకే...?
అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం ఎమ్మెల్యే గా గెలిచి తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని అనకాపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చిన అవంతి శ్రీనివాస్.. భీమిలి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి తొలి మూడేళ్లపాటు జగన్ క్యాబినెట్లో పర్యావరణ.. అటవీశాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం జగన్ ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించి గుడివాడ అమర్నాథ్కు మంత్రి పదవి కేటాయించారు.
ఇక ఎన్నికలలో అవంతి శ్రీనివాస్.. భీమిలిలో గంటా శ్రీనివాసరావు చేతిలో ఏకంగా 92,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. పేరుకు మంత్రిగా ఉన్న పెత్తనం అంత వై.వి. సుబ్బారెడ్డి లేదా విజయసాయిరెడ్డి లేదా జగన్ చేసుకుంటూ వచ్చారు. అవంతి శ్రీనివాస్ వైసీపీలో ఒక డమ్మీ నేతగా మిగిలిపోయారు. ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు.. తిరిగి విశాఖపట్నం విజయ సాయిరెడ్డి చేతుల్లో పెట్టడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. వైసీపీలో ఉన్న పెద్దగా విలువ లేదన్న నిర్ణయానికి వచ్చిన అవంతి శ్రీనివాస్ పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.