ఆ ఊరి పేరే దీపావళి.. ఎక్కడో తెలుసా?
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. అయితే ప్రతి ఏడాది ఇలా హిందువులందరూ దీపావళి పండుగను జరుపుకోవడం చేస్తుంటారు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఏకంగా దీపావళి అనే పండగ పేరుతోనే ఒక ఊరూ ఉంది అంటే ఎవరైనా నమ్ముతారా. దాదాపుగా ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ దీపావళి అనే పేరుతో ఒక ఊరు కూడా ఉందట.
అది ఎక్కడో కాదు మన ఏపీలోనే. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో దీపావళి అనే పేరుతో ఒక గ్రామం ఉందట. అక్కడ ప్రజలు ఐదు రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. ఎక్కడ లేని విధంగా పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తూ దీపావళి పండుగను జరుపుకుంటారట. అయితే ఆ గ్రామానికి ఈ పేరు రావడానికి వెనుక ఒక పురాణ గాధ కూడా ఉందట. ఒకానొక సమయంలో సిక్కోలు రాజు మరో ప్రాంతానికి వెళ్తూ ఆ ఊరిలో స్పృహ కోల్పోయాడట. ఆ సమయంలో గ్రామ ప్రజలందరూ దీపాల వెలుగులో ఆయనకు సపర్యలు చేశారట. దీంతో ఆయన వెళ్తూ వెళ్తూ ఇక ఆ గ్రామానికి దీపావళి అనే పేరును పెట్టారని అక్కడి జనాలు చర్చించుకుంటూ ఉంటారు.