ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడదల రజినీ కూడా పార్టీకి రాజీనామా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రజినీ పార్టీ క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తిగా పేరుగాంచినా, ఆమె వైసీపీని విడిచిపెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.అవును.. మీరు వింటున్నది నిజమే. వైసీపీ హయాంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మంత్రి విడదల రజిని ఓ వెలుగు వెలిగారు! అధికారం పోయేసరికి ఆ వెలుగు మొత్తం ఆరిపోయింది! దీనితో పక్కచూపులు చూస్తున్నట్లుగా. దీనికి తోడు కొన్ని కేసులు కూడా వెంటాడుతుండటం, ఆర్థికంగా, వ్యాపార పరంగా అన్ని విధాలుగా సపోర్టు కావాలని కోరుకుంటున్న రజినీ వైసీపీ నుంచి విడుదల కావాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని. ఓ మాజీ మంత్రి ద్వారా రాయబారం నడిపినట్లు సమాచారం. ఇంతకీ ఎవరా మంత్రి? ఇందులో నిజానిజాలెంత? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవి చేతిలో 51150 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ప్రస్తుతం ఈమె జనసేన లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లి పోతున్నారు. పార్టీలో ఉన్నంతసేపు క్రమశిక్షణ గల నాయకులుగా చెప్పుకుంటూ తర్వాత ప్లేటు ఫిరాయిస్తున్నారు. జగనన్న పేదల మనిషి అని పొగిడిన నాయకులు ఉన్నట్టుండి పార్టీ నుంచి బయటకు వస్తూ జగన్ కు షాక్ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రజినీ.. వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి, సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి.ఇక పార్టీ పరిస్థితి సరిగ్గా లేకపోవడం, తగిన గుర్తింపు లేకపోవడంతో ఇక జనసేనలోకి జంప్ కావాలని, త్వరలోనే భవిష్యత్ ప్రకటించాలని విడదల ఫిక్స్ అయ్యారట. నిజానికి రజిని జంప్ అవుతారనే వార్తలు రావడం కొత్తేమీ కాదు.. ఆ మధ్య ఇలానే వార్తలు రావడం, జగన్ వినుకొండ పర్యటనలో ప్రత్యక్షమవ్వడంతో వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈసారి ఏమవుతుందో.. ఏం జరుగుతోందో చూడాలి మరి.