సత్య నాదెళ్లతో నారా లోకేశ్.. ఏపీకి ఆ పరిశ్రమలు రావడం పక్కా!

Reddy P Rajasekhar
ఏపీ మంత్రి నారా లోకేశ్ రాష్ట అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఎంతో కష్టపడుతున్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఎంట్రీ కోసం ఆయన పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. తాజాగా నారా లోకేశ్ సత్య నాదెళ్లను కలిసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నారా లోకేశ్ అమెరికా పర్యటనలో ఉన్నారు.
 
అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దడానికి సహకారం అందించాలని సత్య నాదెళ్లను నారా లోకేశ్ కోరారు. ఏపీ ప్రయోజనాల కొరకు లోకేశ్ సత్య నాదెళ్లను కలవడం జరిగింది. ఏపీకి రావాలని నారా లోకేశ్ సత్య నాదెళ్లను కోరారు. ఏపీలో కీలక నాయకుడిగా లోకేశ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రజల మెప్పు పొందే విధంగా లోకేశ్ ముందడుగులు వేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
 
నారా లోకేశ్ రాబోయే నాలుగేళ్లలో ఏపీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రశంసలు అందుకోవడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. నారా లోకేశ్ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ వాళ్ల మెప్పు పొందడంలో సక్సెస్ అవుతున్నారు. ఏపీకి పరిశ్రమలు వస్తే నిరుద్యోగుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
ఏపీలో సూపర్ సిక్స్ హామీలు సైతం ఒక్కొక్కటిగా అమలవుతుండటం గమనార్హం. ఈరోజు నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అమలు కానుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ అమలైతే మాత్రం నారా లోకేశ్ భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు సైతం మెరుగుపడతాయని చెప్పవచ్చు. నారా లోకేశ్ మంత్రిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు. నారా లోకేశ్ విజనరీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి సర్కార్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం కొసమెరుపు. నారా లోకేశ్ టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: