ఏపీ: మరో ఘోరం.. స్కూల్ విద్యార్థిపై అత్యాచారం.. అసహ్యించుకుంటున్న ప్రజలు..!

Divya
ఆంధ్రప్రదేశ్లో అత్యాచార ఘటనలు రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి. వీటి పైన ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది. అందుకే చాలామంది మహిళలు బయటికి రావడానికి భయపడుతూ ఉండడమే కాకుండా తమ పిల్లలను బయటకి పంపించాలన్నా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు తాజాగా కడప జిల్లాలోని పెద్దముడియం మండలంలో ఒక గ్రామంలో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా బయటికి వచ్చిన ప్రజల సైతం అసహ్యించుకునేలా ఈ అత్యాచార సంఘటన వెలుగులోకి వచ్చింది.

అసలు విషయంలోకి వెళ్తే పెద్దముడియం మండలం పరిధిలో ఒక గ్రామంలో దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారట. ఇందులో పెద్ద కుమార్తె పదవ తరగతి చదివి తల్లితో పాటు పనులు చేస్తూ జీవనం సాగిస్తే ఉండేదట. అయితే ఈమె తండ్రి కూడా కూలి పనికి వెళ్లేవారు.. అలా మద్యానికి బానిస అయిన ఈయన శనివారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య లేదని కూతురు పైన అఘాయిత్యానికి పాల్పడ్డారట. అయితే గత రెండు రోజుల నుంచి కూతురు అనారోగ్యంగా ఉండడంతో తల్లి ప్రశ్నించడంతో తండ్రి చేసిన ఆకృతాన్ని ఆ బాలిక బయటపెట్టింది.

దీంతో వెంటనే బాలిక తల్లి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు ఇయ్యగా నిందితుడి మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన ఆ తండ్రిని సైతం అక్కడి గ్రామ ప్రజలు చితకొట్టారు. దీంతో ఎస్సై సుబ్బారావు కూడా అక్కడి ప్రజలను సైతం ప్రశంసించారు. అయితే ఇలాంటి తండ్రిని సైతం ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు. కన్న తండ్రి వద్ద రక్షణ లేకపోతే ఇక సమాజం ఏమైపోతుంది అంటూ తెలియజేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం మహిళల మీద జరుగుతున్న ఇలాంటి అత్యాచారాల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రక్షణ కల్పిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: