పోల‌వ‌రం విష‌యంలో కొత్త ర‌గ‌డ .. వైసీపీ ఎటాక్ స్టార్ట్‌...!

RAMAKRISHNA S.S.
పోల‌వ‌రం.. ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌రం.. ఈ మాట త‌ర‌చుగా ఉంటూనే ఉన్నాం. ప్ర‌భుత్వాలు మారుతున్నాయి కానీ, పోల‌వ‌రం రాతే మార‌డం లేదు. ఎవ‌రు వ‌చ్చినా.. అదిగో అయిపోతుంది.. ఇదిగో అయిపోతుంది.. అనే వాగ్దానాలు, హామీల‌కు ఢోకాలేకుండా పోయింది. . కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం దీనికి భిన్నంగా ప‌రిస్థితి మారిపోయింది. ప్ర‌స్తుతం కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. పోల‌వ‌రం ఎత్తు విష‌యంలో రాజ‌కీయం రాజుకుంది. .

వాస్త‌వంగా పోల‌వరం ప్ర‌తిపాదించిన‌ప్పుడు 45.17 మీట‌ర్లు(150.2 అడుగులు) ఎత్తుతో నిర్మించాల‌ని భావిం చారు. కానీ, కేంద్రం మాత్రం దీనిని 41.96 మీట‌ర్ల‌కు కుదించింది. ఇది ఎవ‌రి పాపం? అనేది ఇప్పుడు రాజ‌కీయంగా జ‌రుగుతున్న వివాదం. . జ‌గ‌న్ హ‌యాంలోనే ఎత్తును త‌గ్గించార‌ని..అప్ప‌ట్లో ఆయ‌న మౌనంగా ఉన్నాడ‌ని.. . అందుకే రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతోంద‌ని ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం చెబుతోంది. .

అయితే.. అస‌లు కేంద్రం నిర్మించాల‌న్న ప్రాజెక్టును రాష్ట్రం తీసుకోవ‌డం ఏంటి?  జ‌ర‌గాల్సిన త‌ప్పు అప్పుడే జ‌రిగిపోయింద‌ని వైసీపీ నుంచి ఎదురు దాడి జ‌రుగుతోంది. ఇక‌, దీనికి మ‌ధ్యే మార్గంగా మంత్రి నిమ్మ‌ల రామానాయుడు స‌రికొత్త ప్ర‌తిపాద‌న చేశారు. అదే.. తొలిద‌శ‌లో 41.96 మీట‌ర్లు నిర్మిస్తార‌ని, మ‌లి ద‌శ‌లో పూర్తిస్థాయిలో 45.17 మీట‌ర్లు నిర్మిస్తామ‌ని చెప్పుకొచ్చారు. కానీ, కేంద్రంలో మాత్రం తొలి-మ‌లి అనే రెండు ద‌శ‌లు లేవ‌న్న‌ది ఆయ‌న‌కు కూడా తెలిసిందే.

ఉన్న‌ది ఒక్క‌టే ద‌శ‌. గ‌తంలో జ‌గ‌న్ ఈ ఎత్తు విష‌యంలోనే కేంద్రంతో పేచీప‌డ్డారు. దీంతో కాలం గ‌డిచిపోయింది. అడుగు కూడా ముందుకుప‌డ‌లేదు. దీనిని వ్యూహాత్మ‌కంగా భావిస్తున్న కూట‌మి స‌ర్కారు ముందు ప‌నులు జ‌రిగితే చాలు..  .అని 41.96 మీట‌ర్ల‌కు త‌లూపింది. ఇంత‌కుమించి భ‌విష్య‌త్తులో జ‌రిగేదీ.. . . .ఒరిగేది కూడా ఏమీ ఉండ‌ద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. సో.. మొత్తానికి పోల‌వ‌రం.. మ‌ళ్లీ మ‌ళ్లీ రాజ‌కీయ వివాదాల‌కు కేంద్రంగానే మారుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: