జమిలి ఎలక్షన్స్ పై.. కుండబద్దలు కొట్టిన మోడీ..!

Divya
గత కొన్ని నెలల నుంచి దేశమంతటా కూడా జమిలి ఎన్నికలు జరగబోతున్నాయనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం హింట్ ఇవ్వడంతో చాలా ప్రాంతాలలో ఈ విషయం వైరల్ గా మారుతున్నది. ఇటీవల బీజేపీ నేతలు కూడా ఈ విషయం పైన ఒక్కొక్కరు స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దేశంలోని జమిలి ఎన్నికల పైన ఒక కీలకమైన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జరిగిన ఉత్సవాలలో మోడీ మాట్లాడుతూ ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

మోదీ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే లక్ష్యం వంటి విషయాలను ప్రస్తావిస్తూ దేశాన్ని బలపరచడం కోసమే జమిలి ఎన్నికలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలియజేశారు.. వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ సివిల్ కోడ్ వంటి విధానాలను కూడా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఒకే లాగా ఉండాలని ఉద్దేశంతోనే జమిలి ఎన్నికలు అవసరమంటూ తెలియజేశారు. అంతేకాకుండా జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలోనే సిద్ధమయ్యిందనే విధంగా తెలుస్తోంది.త్వరలోనే అందుకు సంబంధించి కార్యచరణాలు కూడా జరగబోతున్నాయట.

2027 నాటికి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరగవచ్చని కూడా తెలిపారు. అప్పుడే దేశం మొత్తం ఒకేసారి ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాలంటూ సూచించారు ప్రధానమంత్రి మోడీ. జమిలి ఎన్నికల తీరును సైతం కొనసాగించడం వల్ల ప్రజాస్వామ్యంలో స్థిరత్వం సమర్థతను సైతం పెంచుతుంది అని.. అందుకే కూటమి దీన్ని ఒక ప్రధాన లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళుతోంది అంటూ తెలిపారు మోడీ ఇప్పుడు దేశంలోనే రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రక్రియలోని అనుసరించేలా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. మరి శీతాకాల సమావేశంలో ఈ బిల్లును సైతం ప్రవేశపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది మరి ఏ మేరకు జమిలి ఎన్నికలకు ఏ ఏ రాష్ట్రాలు ఒప్పుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: