ఏపీ వాలంటర్లు: డబల్ గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు..!

Divya
ఏపీలోని కూటమి సర్కార్ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను సైతం ఎంత కష్టం వచ్చినా సరే ఒక్కొక్కటి అమలు చేస్తామంటూ తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే దీపావళికి ఉచిత సిలిండర్లు, పింఛని పెంపు వ్యవహారం పైన మాత్రమే ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఎన్నికలలో హామీలు భాగంగా వాలంటరీలకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం చంద్రబాబు. మరికొద్ది రోజులలోనే నెరవేర్చే విధంగా సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వాలంటరీలకు ఈసారి డబల్ గుడ్ న్యూస్ చెప్పినట్లుగా సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా లక్షన్నర మంది పైగా వాలంటరీలు ఉన్నారు. వీరందరికీ త్వరలోనే డబల్ గుడ్ న్యూస్ చెప్పబోతుందట కూటమి ప్రభుత్వం. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే వాలంటరీ వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగిస్తామని అంతేకాకుండా జీతం పదివేల రూపాయలు చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఐదు నెలలకు పైగా కావస్తున్న వీరి గురించి పట్టించుకోకపోవడంతో వీరు ధర్నాలు చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఇప్పుడు తాజాగా వాలంటరీలకు పదివేల రూపాయలు గౌరవ వేతనంతో పాటు.. పాత బకాయిలను కూడా ఒకేసారి చెల్లిస్తామంటూ చెప్పడంతో డబల్ గుడ్ న్యూస్ గా వినిపిస్తోంది.

ఇందుకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. వాలంటరీలందరినీ కూడా త్వరలోనే విధులకు తీసుకోబోతున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన క్యాబినెట్లో కూడా వాలంటరీల ,సచివాలయ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సర్ వచ్చే ఏడాది సంక్రాంతి లోపు వీరు ఉద్యోగానికి భద్రత కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అలాగే వీరికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ప్రజలకు కావలసిన ఏదైనా సమాచారాన్ని సైతం వాలంటర్లు అందించే విధంగా  పక్క ప్రణాళికతోనే ముందుకు వెళ్లాలని ప్లాన్ చేసుకోండట కూటమి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: