పాపం..! చైనాలో పెళ్లి చేసుకుందాం అంటే పిల్ల దొరకడం లేదు అంట? అక్కడి మగవాళ్ళ పరిస్థితి ఏంటో?
అవును... సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోవడం, వృద్ధాప్య జనాభా విపరీతంగా పెరిగిపోవడం వంటి సమస్యలు వేధిస్తోన్న వేళ.. తాజాగా చైనాకు మరో సమస్య తీవ్రంగా ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా... పెళ్లిళ్లకు ఆడపిల్లల కొరత ఆందోళన కలిగిస్తుందంట. ఆ దేశంలో మహిళలు చాలా తక్కువ ఉన్నారని అంటున్నారు.
ప్రస్తుతం చైనా జనాభాలో 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పెళ్లికాని పురుషులు వారు సుమారు 35 మిల్లియన్ల వరకూ ఉన్నారని అంటున్నారు. వీరంతా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్క.. బ్రహ్మచారులుగానే మిలిపోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక చైనీస్ ప్రొఫెసర్ ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని సూచిస్తున్నారు.
చైనాలో పురుషులకు ఉన్న ఈ సమస్యకు విదేశీ వధువులను ఎంచుకోవడం ఒకటే ఏకైక మార్గమని అంటున్నారు. వాస్తవానికి చైనా 2020లో నిర్వహించిన జాతీయ జనాభా లెక్కల ప్రకరం.. దేశంలో పురుషుల సంఖ్య, మహిళల సంఖ్య కంటే సుమారు 3.4 కోట్లు ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జియామెన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డింగ్ చాంగ్ఫా అంతర్జాతీయ వివాహాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా... చైనీస్ పురుషులు తమ జీవిత భాగస్వాములు కోసం రష్యా, వియత్నాం, కంబోడియా, పాకిస్థాన్ వంటి దేశాల్లో చూడవచ్చునని సూచిస్తున్నారు డింగ్.
ఇలా చైనాలో లింగ అసమానతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో.. కొంతమంది ప్రొఫెషనల్ మ్యాచ్ మేకర్లు చైనీష్ పురుషులను రష్యన్ మహిళలతో కనెక్ట్ చేయడమే లక్ష్యంగా మ్యాచ్ మేకింగ్ సర్వీసులను అందించడం ప్రారంభించినట్లు చెబుతున్నారు. రష్యాలో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉండటం కూడా ఈ ప్రయత్నానికి గల కారణం అని అంటున్నారు!