ఏపీ: టిడిపి పార్టీ నుంచి.. సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై..!

Divya
టిడిపి పార్టీ పుట్టినప్పటినుంచి చాలామంది నేతలు అందులోనే ఉంటూ బాగానే పేరు సంపాదించారు. అలాంటి వారిలో సీనియర్ నేత విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. ఈయన ఇటీవలే ఒక బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.తన రాజకీయ జీవితానికి ఇక పూర్తిగా విరామం తీసుకోబోతున్నట్లు ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇక తనకు రాజకీయ జీవితం చాలు అని 2029 ఎన్నికలలో తాను పోటీ చేయనని స్పీకర్గా అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంటానని తెలిపారు అయ్యన్నపాత్రుడు.

తన రాజకీయ జీవితంలో ఇక పోటీ చేసే ప్రసక్తి లేదని తనకు కూడా వయసు పెరిగిపోతోందని తెలిపారు అందుకే రాజకీయాల నుంచి విరామం తీసుకోబోతున్నట్లు తెలిపారు. పదవులు ఎవరికి శాశ్వతం కాదని పార్టీ నేతలకు దిశా నిర్దేశం ఇస్తూ.. పదవిలో మనం మంచి పనులు చేస్తే చిరస్థాయిగా ఉంచుతాయి అంటూ తెలిపారు. తాను 2029లోగా చేయాలనుకున్న మంచి పనులను సైతం చేసి తీరుతా అంటూ తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదని తెలిపారు అయ్యన్నపాత్రుడు.
చంద్రబాబు విశాఖలో ఉన్న వేళ అదే ప్రాంతానికి చెందిన సీనియర్ నేత చంద్రబాబు కంటే టిడిపిలో ఉన్న అత్యంత సీనియర్ నాయకుడు అయిన అయ్యన్నపాత్రుడు ఈ విధంగా ప్రకటన చేయడంతో కాస్త చర్చ కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈయన గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకోవడం లేదంటూ తెలిపారు. కానీ అప్పట్లో టిడిపి పార్టీకి చాలా అత్యంత కీలకమైన ఎన్నికలని న్యాయకత్వమే పోటీచేయాలని ఒత్తిడి తేవడంతో నిలబడ్డారని 2024లో తన కుమారుడికి టికెట్ ఆవడగగా కానీ హైకమాండ్ తనకైతే సీటు ఇస్తానని చెప్పడంతో ఆయన నిలబడినట్లు సమాచారం. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు తన హుందాతనాన్ని పాటిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. తన కుమారుడు విజయ్ ని రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చేలా చేస్తున్నారట. మొత్తానికి ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించడంతో టీడీపీలో ఈ విషయం చర్చనీయంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: