విజయమ్మను లేపేయాలని జగన్ ప్లాన్... నిజం ఎంత..?
2023లో విజయమ్మ నెల్లూరు జిల్లాకు వచ్చారు. వైవీ సుబ్బారెడ్డి తల్లి అనారోగ్యంతో ఉంటే..ఆమెను పరామ ర్శించేందుకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో ఆమె ప్రయాణిస్తుసన్న అధునాతన కారుకు ప్రమాదం జరిగింది. రెండు వెనుక టైర్లు ఒకేసారి పంక్చర్లు అయ్యాయి. పైగా అది కొత్త కారు. అయినా.. టైర్లు పంక్చర్లు అయ్యాయంటే.. దీనివెనుక కుట్ర ఉందనేది టీడీపీ నాయకులు తాజాగా చెబుతున్నమాట.
నిజానికి అప్పట్లోనే ఈ విషయం చర్చకువ చ్చింది. అయితే.. దీనిపై అటు విజయమ్మ కానీ, ఇటు జగన్ కానీ స్పందించలేదు. పైగా ప్రమాదం జరిగిందని తెలిసినా.. జగన్ రియాక్ట్ కాకపోవడాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగా ఇలా చేశారని.. అందుకే.. ఆమె టైర్లకు పంక్చర్లు అయ్యాయని, తృటిలో ప్రాణాపాయం తప్పిందని అంటున్నారు. ఈ సయమంలోనే 2019లో కోడికత్తి డ్రామాతోపాటు.. వివేకా హ్యత్యను వాడుకున్న ఉందంతాలను కూడా ప్రస్తావిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విజయమ్మ ఎన్నికల ప్రచారానికి రాకుండా 2024 ఎన్నికల సమయంలో అమెరికా కు వెళ్లిపోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఇంతసంచలన వ్యాఖ్యలు తెరమీదికి వచ్చినా వైసీపీ నాయకులు రియాక్ట్ కాకపోవడం గమనార్హం. మరి దీనిని బట్టి.. నిజం ఉందని అనుకోవా లా? లేక.. టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తారా? అనేది ప్రశ్న. కానీ, సామాన్యుల వరకు ఈ విషయం చేరితే.. జగన్ తల్లిని చంపేందుకు ప్రయత్నించారన్న వాదన బలపడితే.. అది చెల్లి ఎపిసోడ్ కంటే సీరియస్‌గా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.