వైసీపీ మాజీ వాసిరెడ్డి ప‌ద్మ ఆ పార్టీలో చేరుతున్నారా... మీడియేట‌ర్ ఎవ‌రంటే..?

RAMAKRISHNA S.S.
- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) . .

వాసిరెడ్డి పద్మ రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పరిచయం ఉన్న మహిళా రాజకీయ నేత. ప్రజారాజ్యంలో అధికార ప్రతినిధిగా ఉంటూ తన బలమైన వాయిస్ వినిపిస్తూ బాగా పాపులర్ అయ్యారు. ప్రజారాజ్యం నుంచి వైసీపీ వైపుగా వచ్చి అక్కడ తన రాజకీయాన్ని మరింతగా ప‌దిల పరుచుకున్నారు. వైసీపీలో ఆమె రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పని చేశారు. క్యాబినెట్ ర్యాంకు కలిగిన కీలకమైన పదవి అది. అలాగే వైసిపిలో బలమైన మహిళ నేతగా ఉంటూ వచ్చారు. పార్టీ తరఫున వాయిస్ ను గట్టిగా వినిపించే ప్రత్యర్థులను హ‌డలె త్తించేవారు. కొద్ది రోజుల క్రితం వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీని వీడుతున్న సమయంలో జగన్ మీద ఆమె విమర్శలు కూడా చేశారు.

పార్టీని ప్రభుత్వాన్ని నడపడంలో జగన్ ఫెయిల్ అయినట్టు ఆమె చెప్పారు. వాసిరెడ్డి పద్మ మంచి సబ్జెక్టుతో మాట్లాడుతారు.. అందువల్ల ఆమె ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి చాలా ప్లస్ అవుతూ వస్తుంది. ఇక వైసిపి కి గుడ్ బై చెప్పిన పద్మ ఇప్పుడు టిడిపి - జనసేన లో ఏ పార్టీలో చేరతారు లేదా కాంగ్రెస్ లోకి వెళతారా ? అన్న ప్రచారం వారం రోజుల నుంచి నడుస్తోంది. అయితే లేటెస్ట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు అన్ని పార్టీలలోను ఆప్తులు ఉన్నారని .. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తమకు ఎంతో ఆప్తులు అని ఆమె చెప్పారు. ఈ మాటను బట్టి వాసిరెడ్డి పద్మ టిడిపిలో చేరబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. ఆమె వైసీపీలో ఉన్న‌ప్పుడు టీడీపీ తో పాటు చంద్ర‌బాబుపై తీవ్రమైన విమర్శలు చేసేవారు. ఇప్పుడు ఆమె అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అదే టిడిపిలోకి వెళుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: