మంత్రి గొట్టిపాటి అద్దంకికి అదిరిపోయే వరం...!
గొట్టిపాటి రవికుమార్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి సమైక్యాంధ్రప్రదేశ్ రాజకీయాలలో మంచి గుర్తింపు ఉన్న నేత. 2004 లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన రవికుమార్ మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా చిన్న వయసులోనే విజయం సాధించారు. నాటి నుంచి నేటి వరకు వరుసగా ఐదు సార్లు ఓటమి లేకుండా రెండు నియోజకవర్గాలు మారి మూడు పార్టీల తరఫున ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2004లో మా ర్టూరు నుంచి కాంగ్రెస్ తరపున .. 2009 లో అద్దంకిలో కాంగ్రెస్ తరపున ... 2014 లో అద్దంకిలో వైసీపీ నుంచి 2019 - 2024 ఎన్నికలలో అద్దంకిలో టిడిపి తరఫున ఇలా వరుసగా ఐదు సార్లు గెలిచిన గొట్టిపాటి రవికుమార్ కు ఎట్టకేలకు తాను కోరుకున్న మంత్రి పదవి 25 సంవత్సరాల తర్వాత దక్కిందని చెప్పాలి.
ఇదిలా ఉంటే తనను వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తూ వస్తున్న అద్దంకి నియోజకవర్గ ప్రజలకు రవికుమార్ అదిరిపోయే వరాన్ని ప్రభుత్వం ద్వారా తీసుకు రానున్నారు. జిల్లాల పునర్విభజలో బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయించేందుకు రవికుమార్ కృషి చేస్తున్నారు.. ఇది దాదాపు పరిశీలనలో ఉంది. అద్దంకి నియోజకవర్గం లోని అద్దంకి మున్సిపాలిటీ అద్దంకి - కురిశపాడు - జే పంగులూరు - సంతమాగులూరు - బల్లికురవ మండలాలతో కలిపి అద్దంకి రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీ సత్య సాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గ కేంద్రాన్ని కూడా రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే మడకశిర - అద్దంకి నియోజకవర్గాలు రెవెన్యూ డివిజనల్ గా రూపాంతరం చెంది అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.