ఏపీ: మోదీకి నో చెప్పిన జగన్.. ఇరకాటంలో కూటమి..!
ముస్లిం సామాజికానికి ఎప్పుడూ కూడా అండగా తమ పార్టీ ఉంటుందంటూ వైఎస్సార్ సీపీ పార్టీ విజయసాయిరెడ్డి కూడా తెలియజేశారు. అందుకే వారికి వ్యతిరేకమైనటువంటి వక్ఫ్ బిల్ ను కూడా తమ పార్టీ వ్యతిరేకించిందని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సవరణ ముస్లిం సోదరులకు చాలా వ్యతిరేకంగా ఉండడంతో 8 పాయింట్లు పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకే వ్యతిరేకించాము అంటూ తెలియజేశారు వైసిపి నేత విజయసాయిరెడ్డి. మరి ఎన్డీఏలో కూటమిగా ఉన్న టిడిపి పార్టీ మాత్రం బిజెపితో చేతులు కలిపి ఈ బిల్లును పాస్ చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
గత పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లును సైతం క్యాబినెట్లో అమలు చేశారని దీనికి మద్దతుగా టిడిపి నుంచి కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా ఆమోదించారు అంటూ తెలియజేశారు.. ఒకవేళ ఆ పార్టీ వక్ఫ్ బిల్ ను వ్యతిరేకిచ్చినట్లు అయితే టిడిపి మంత్రులు కూడా రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటికి రావాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది.. ముస్లింలకు నష్టం జరిగే విధంగా ఉన్న ఈ బిల్లును సైతం ఎట్టి పరిస్థితుల్లో వైసిపి పార్టీ అంగీకరించదంటూ విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు.
జమైత్ ఉలేమా సీఎం చంద్రబాబుకు సైతం ఈ లేఖను వ్యతిరేకించాలంటూ అభ్యర్థించారట.. ముస్లింల మనోభావాలను సైతం గౌరవించినట్లు అయితే వీటిని వ్యతిరేకించాలని ఈ బిల్లు ముస్లింలకు ప్రమాదకరమని మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండాలని కోరారట. మరి విషయం పైన టిడిపి, జనసేన ఏం చేయబోతుందో చూడాలి.