స్వింగ్ స్టేట్స్ లో ఆ అభ్యర్థి హవా.. అమెరికా ఫలితాలు ఇలా ఉండబోతున్నాయా?
మరోవైపు రూపాయి విలువ 84.1 వద్దకు చేరింది. పోలింగ్ కు ముందు స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ హవా ఉండటం గమనార్హం. సర్వేల ద్వారా ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. అట్లాస్ ఇంటెక్స్ తాజా పోల్స్ ఈ గణాంకాలను వెల్లడిస్తున్నాయి. 48 శాతం మంది ట్రంప్ నకు అనుకూలంగా ఉన్నారని సమాచారం అందుతోంది. కమలా హారిస్ కు లభించిన మద్దతుతో పోల్చి చూస్తే ఈ మద్దతు 1.8 శాతం అధికమని భోగట్టా.
నవంబర్ లోని 1, 2 తేదీలలో ఈ సర్వేను నిర్వహించారని సమాచారం అందుతోంది. ట్రంప్ సైతం తన చివరి దశ ప్రచారాన్ని స్వింగ్ స్టేట్స్, బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లో నిర్వహించారు. ఈ స్టేట్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించనున్నాయి. మూడు రకాల రాష్ట్రాలు ప్రధానంగా అమెరికా ఎన్నికల ఫలితాలను నిర్ణయించనుండటం గమనార్హం.
వీటిని రెడ్, బ్లూ, స్వింగ్ స్టేట్స్ అభివర్ణిస్తారనే సంగతి తెలిసిందే. స్వింగ్ స్టేట్స్ లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతారు. 2020 ఎన్నికలలో అర్జిజోనాలో బైడెన్ కేవలం 10000 మెజార్టీతో విజయం సాధించారు. ఇదే రాష్ట్రాలలో అక్టోబర్ 29వ తేదీన రాయిటార్స్ ఇప్పాస్ సర్వేలో డెమోక్రాట్లు ముందంజలో ఉన్నట్టు వెల్లడైంది. అమెరికా ఎన్నికల ఫలితాలు నిజంగానే ట్రంప్ నకు అనుకూలంగా వస్తాయో రావో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎవరు గెలిచిన స్వల్ప మెజార్టీతోనే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.