బాబు పాలనపై మేధావుల రియాక్షన్ ఇదే.. గతంతో పోలిస్తే చాలా బెటర్ కానీ?

Reddy P Rajasekhar
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 150 రోజులైంది. ఈ 150 రోజుల్లో చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఎక్కువ సంఖ్యలో పథకాలను అమలు చేశారు. అయితే చంద్రబాబు పాలన విషయంలో మేధావుల రియాక్షన్ ఎలా ఉందనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు పాలన జగన్ పాలనతో పోలిస్తే మెరుగ్గానే ఉంది కానీ మరిన్ని జాగ్రత్తలు అవసరమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
చంద్రబాబుకు గత కొన్ని నెలల్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని అయితే ఆ సవాళ్లను చంద్రబాబు సులువుగానే అధిగమించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ చేసిన తప్పుల భారం కూడా కూటమిపై పడిందనే సంగతి తెలిసిందే. అయితే వాటిని సైతం నెమ్మదిగా అధిగమించే దిశగా అడుగులు పడుతున్నాయి.
 
వైసీపీ చేసిన తప్పులకు చెక్ పెట్టేలా కూటమి అడుగులు పడటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ అప్పులను సైతం వీలైనంత తగ్గించే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. పథకాలను పప్పూ బెల్లాల్లా అమలు చేయాలని కూటమి ఫీలవ్వడం లేదు. ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే దిశగా అడుగులు పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
టీడీపీ మంత్రుల పనితీరుపై కూడా నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ దూసుకెళ్లేలా చంద్రబాబు నాయుడు అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయి. మరి ఈ ప్రణాళికల విషయంలో చంద్రబాబు ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూటమికి సవాళ్లను విసరడంలో ఫెయిలవుతోంది.
వైసీపీ తప్పులు కూటమికి ఊహించని విధంగా ప్లస్ అవుతున్నాయని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సైతం మరిన్ని మంచి పథకాలను అమలు చేస్తూ ప్రశంసలు అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బాబు విజన్ కు హ్యాట్సాఫ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: