నేడే పోలింగ్‌..ట్రంప్ వర్సెస్ కమల.. తొలి అధ్యక్షుడు అతనే..?

Veldandi Saikiran
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల సమరం మోగింది. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అగ్రరాజ్యం అమెరికా మొత్తం.. ఒకేసారి పోలింగ్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ అమెరికా ఎన్నికల నేపథ్యంలో.... రిపబ్లిక్ అండ్ పార్టీ అభ్యర్థి గా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఇండియా మూలాలు కమలా హారిస్ బరిలో ఉన్నారు.
వాస్తవంగా... ఇండియా మూలాలు ఉన్న కమలా హారిస్.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. దీంతో.. ఈ ఇద్దరి మధ్య పోటీ హోరా హోరీగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6.8 కోట్ల మంది....  ముందస్తు ఓటు హక్కును కూడా వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈసారి తటస్థ ఓటర్లు ఎవరు వైపు.. ఉంటారో ఆ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని చెబుతున్నారు.
ముఖ్యంగా... నార్త్ కరోలినా, జార్జియాలలో కమలహరి... విజయం సాధించబోతుందని...  ఆమె వైపు అక్కడి ప్రజలు ఉంటారని కొన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.  అంతేకాదు నెవడ, నార్త్ కరోలినా... విస్కాన్సిన్ ప్రాంతాల్లో స్వల్ప ఆదిక్యం... ఆమె సాధిస్తారని చెబుతున్నాయి సర్వేలు. అయోవా రాష్ట్రంలో కమలా హారిస్ ముందున్నారని మరో సర్వే సంస్థ వెల్లడించడం జరిగింది. ఈ లెక్క ప్రకారం కమలా హారిస్ కు 47% ఓట్లు... డోనాల్డ్ ట్రంప్ కు 40 నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి సర్వేలు.

అయితే ఈ లెక్కలను ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. ఇక కొన్ని సర్వే సంస్థలు 1.8%తో... అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుస్తారని చెబుతున్నాయి. ఇదంతా పక్కకు పెడితే.. అమెరికా మొదటి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ పనిచేయడం జరిగింది 1789  సంవత్సరంలో...జార్జ్ వాషింగ్టన్... అమెరికా తొలి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. ఆయనొక్కడే ఏ పార్టీకి సంబంధం లేకుండా నేరుగా అధ్యక్షుడు అయ్యారు. ఇప్పటివరకు 45 మంది అధ్యక్షులు మారారు. బైడన్ 46వ వాడు. ఇప్పుడు జరిగేది 47వ అధ్యక్ష పదవికి ఎన్నిక అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: