అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? ఎలా ఓటు వేయాలి ?

Veldandi Saikiran
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల నగార మోగిన సంగతి తెలిసిందే. ఇవాళ అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఒక్కడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొన్ని క్షణాల్లోనే ఈ ఎన్నిక ప్రారంభమవుతుంది. వాస్తవంగా... అమెరికా ఎన్నికలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగినట్టు మనకు కనిపిస్తాయి. కానీ అమెరికా ఎన్నికలు ప్రతి రెండు సంవత్సరాలకు... జరుగుతాయని చెబుతున్నారు.

అయితే అధ్యక్షుడు ఎన్నిక బ్యాలెట్ లో ఉన్న సమయంలో దానిని నేషనల్ ఎలక్షన్ కింద తీసుకుంటారని చెబుతున్నారు. అమెరికాలో ఉన్న లోయర్ హౌజ్ లెక్కల ప్రకారం ప్రతి సభ్యుడు పదవి కాలం రెండు సంవత్సరాలు మాత్రమే. కాబట్టి రెండు సంవత్సరాలకోసారి ఈ ఎన్నిక జరుగుతుందన్న మాట. ఇక అప్పర్ హౌస్ లేదా సెనేట్లో ఉన్న ప్రతి సభ్యుడి పదవి కాలం మాత్రం ఆరు సంవత్సరాలు ఉంటుంది. ఇక అమెరికా ఎన్నికల తేదీలను రాజ్యాంగం రూల్స్ ప్రకారమే నిర్ణయిస్తారు.

నవంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగాలని.. ముందే ప్రకటించింది ఎన్నికల సంఘం. దాని.... ప్రకారమే ఆరు నూరైనా... నవంబర్ 5వ తేదీన ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 5 అంటే ఇవాళ... అమెరికా ఎన్నికలు జరిగితే... గెలిచిన అభ్యర్థి.... జనవరి 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాధ్యతలు తీసుకుంటారు. కానీ గెలిచిన అభ్యర్థిని మాత్రం... ఎన్నికల రోజునే ప్రకటించడం జరుగుతుంది. ఒకసారి అమెరికా ఎన్నికల బ్యాలెట్ పరిశీలిస్తే... మన ఇండియా ఎన్నికలు లాగా అమెరికా ఎన్నికలు జరగవు.
ఇండియాలో బటన్ నొక్కితే... ఓటు ప్రక్రియ ముగిస్తుంది. కానీ అమెరికాలో కాదు. ఓటు వేసేటప్పుడు... పేపర్ అలాగే ఎలక్ట్రానిక్ మిశ్రమం ఉంటుంది. అధికారులు ఇచ్చే పేపర్లో చాలా అంశాలు నింపాలి. నేషనల్, ఉపాధి, ఇతర అంశాల పైన... మనం కీలక అంశాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేని అంశాలను కూడా అందులో రాయవచ్చు. అంటే ప్రజాభిప్రాయం ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి... ఇలా బ్యాలెట్ పేపర్లను నిర్వహిస్తారు. వలస వచ్చే వారిపై అభిప్రాయాలను కూడా సేకరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: