షాకింగ్... ఆస్తుల పంపకాల్లో షర్మిలకు సాక్షి! మరి జగన్ పరిస్థితి ఎంటి..?
ఇటీవల వైయస్ విజయమ్మ కూడా తన లేఖలో అదే విషయాన్ని ప్రస్తావించింది. మొత్తంగా చూస్తే సాక్షి జగన్మోహన్ రెడ్డికి కాకుండా షర్మిలకు వెళ్లిపోతే అది వైసీపీకి పెద్ద లాస్ అవుతుందని తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గతించిన తర్వాత సాక్షి జగన్ లైన్ తీసుకుంది. వైసిపిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీకి మౌత్ పీస్ లాగా సాక్షి మారిపోయింది. నాడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. అ పాదయాత్రకు సాక్షి విపరీతమైన కవరేజ్ ఇచ్చింది.
ఇప్పుడు షర్మిల – జగన్ మధ్య ఆస్తుల విభేదాలు మొదలు కావడంతో.. షర్మిలకు వ్యతిరేకంగా సాక్షిలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. సాక్షిలో ఉన్న డైరెక్టర్లు, పై స్థాయిలో ఉన్న వ్యక్తులు మొత్తం కూడా జగన్, భారతి రెడ్డికి అనుకూలమైన మనుషులు. సాక్షి కనుక చేతులు మారితే వారంతా తమ పదవులకు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు తనకంటూ ఒక మీడియా కావాలి కాబట్టి జగన్ కొత్త సంస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
జగన్ వద్ద సాధన సంపత్తి భారీగానే ఉంది కాబట్టి దానిని ఎస్టాబ్లిష్ చేసుకోవడం పెద్ద కష్టం కాదని మీడియా వర్గాలు అంటున్నాయి. ఇక సాక్షి షర్మిల చేతుల్లోకి వెళ్లిపోతే హైదరాబాదులోని భారీ భవనం.. జిల్లా కార్యాలయాలు కూడా ఆమెకే దక్కుతాయని తెలుస్తోంది. అప్పుడు జగన్ తాను ఏర్పాటు చేయబోయే మీడియా సంస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలలో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వైసిపి ఆంధ్రలో మాత్రమే రాజకీయాలు చేస్తోంది కాబట్టి.. ఆయన ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు ప్రింట్ మీడియాలో సాక్షి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఏపీలోనూ అదే పరిస్థితి.