2000 నోట్ల గురించి ఆర్బీఐ కీలక ప్రకటన.. ఆ లెక్కతో క్లారిటీ వచ్చేసిందిగా!
ఈ ప్రకటన అనంతరం ప్రజలు కూడా తమ దగ్గర ఉన్న 2,000 రూపాయల నోట్లను కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం లేదా తమ ఖాతాల్లో జమ చేసుకోవడం చేశారు. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. 2023, అక్టోబర్ 7 వరకు బ్యాంకులు 2,000 రూపాయల నోట్లను ఎక్స్ ఛేంజ్ చేసుకోవడానికి ఆర్బీఐ అవకాశం కల్పించింది.
ఆ తర్వాత క్రమంగా రూ.2 వేల నోట్లను తిరిగి వెనక్కి రప్పించడం గమనార్హం. ఆ తర్వాత ఏకంగా 98.04 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని సమాచారం అందుతోంది. అయితే అక్టోబర్ 31 నాటికి దేశంలో ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.6,970 కోట్లు కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ డబ్బు జమ కాకపోవడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల దగ్గర మాత్రమే 2000 రూపాయల నోట్లను మార్చుకునే అవకాశం అయితే ఉంది. త్వరలోనే మొత్తం రెండు వేల నోట్లు వెనక్కి వచ్చేస్తాయని ఆర్బీఐ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. 2000 నోట్ల రూపాయల విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.