అమెరికా ఎన్నికలు: ఎవరు గెలిస్తే మనకు మేలు..?
•ట్రంప్ అధికారం చేపడితే చైనా పాకిస్తాన్ నుంచి భారత్ కి ఊరట
•కమలా హారీష్ అధ్యక్షురాలు అయితే రష్యా నుంచి సవాళ్ళు తప్పవా..
అమెరికాలో ఎవరు అధ్యక్షుడు అవుతారనే విషయంపై చాలామంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్స్ కూడా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అనే విషయం పైన తెగ ఆలోచిస్తూ ఉన్నారట. మన విద్యార్థులు స్టూడెంట్ వీసాల నుంచి, ఐటీ నిపుణులు అలాగే ఉద్యోగాలు కల్పించే HB -1 వీసా యొక్క నిబంధనలు సైతం సరళ తరంగా ఉంటేనే మన ఇండియన్స్ కి మేలు జరుగుతుందని చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి అమెరికా ఎన్నికల ఫలితాలలో ఎవరు గెలిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం.
గతంలో అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ ఉన్నప్పుడు..HB -1 వీసాల విషయంలో చాలా కఠినమైన నిబంధనలు తీసుకురావడంతో ఇండియన్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారట. ఇటీవలే ప్రచారంలో భాగంగా కూడా ట్రంప్ ఇండియన్ ఉద్యోగులు మన ఉద్యోగాలను దొంగలిస్తున్నారంటూ అక్కడ ఉండే ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారట. అలాగే ఆర్థిక వ్యవహారాలలో కూడా ఇండియా పైన ట్రంప్ చాలా కఠినంగానే వ్యవహరిస్తూ ఉంటారట. ట్రంప్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విదేశీ వలసదారులపైన కఠినమైన చర్యలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇండియాకి శత్రువైన చైనాకు ట్రంప్ బద్ద వ్యతిరేకి.. అలాగే పాకిస్తాన్ అంటే కూడా ట్రంప్ కు పెద్దగా నచ్చదట.
ట్రంప్ గెలిస్తే చైనా పోరులో భారత్ కు అమెరికా మద్దతు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. పాకిస్తాన్, చైనా పట్ల డెమోక్రాట్లు పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే ప్రధాన మోడీ కూడా ట్రంప్ కు మంచి స్నేహితుడు కావడం చేత ఇరుగుపొరుగు దేశాల విషయంలో అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో కూడా మనకు ట్రంప్ ప్రెసిడెంట్ అయితేనే మంచిదని భావిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ట్రంప్ వల్ల నష్టం తప్పదనే భయాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ డెమోక్రాట్లు గెలిస్తే.. అక్కడ మన వాళ్ళ ఉద్యోగాలకు డోకా ఉండదట.. తనని గెలిపిస్తే రష్యాతో ఒప్పందం కుదిరేలా తాను చేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో బాగా ఊదరగొట్టారు..
ఇదే కాకుండా మరొకవైపు ట్రంప్ గెలిస్తే ఇరాన్, చైనా.. అమెరికాకు శత్రువులుగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కమలా హారీష్ అధ్యక్షురాలు అయితే రష్యా నుంచి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అలాగే ఇజ్రాయిల్ విషయంలో మాత్రం ఈ ఇద్దరి అభ్యర్థుల తీరు ఒకేలాగా కనిపిస్తోందట.