అమెరికా అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ , డెమోక్రాట్ కమలా హారిస్ మధ్య గట్టి ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి నుండి కూడా వీరిద్దరికీ కొన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తూ వస్తుంది. దానితో ఎవరైనా గెలిచే అవకాశాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ ప్రజలు భావిస్తూ వస్తున్నారు. ఇకపోతే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా ..? అనే దానిపై ఆ ప్రాంత ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే యూఎస్ ఎలక్షన్స్ రిజల్ట్ అనేవి కొన్ని సందర్భాలలో పోలింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని గంటల్లోనే వస్తాయి.
మరికొన్నిసార్లు మాత్రం రోజులు పడుతుంది. ట్రంప్ , హారిస్ మధ్య తాజాగా పోటీ హోరా హోరీగా జరిగింది. కాబట్టి ఫలితాలు వెలువడేందుకు సమయం చాలానే పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అమెరికా అధ్యక్ష పదవి రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. గతంలో అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఆ రోజు రాత్రి లేదా మరుసటి రోజు ఉదయం ఎన్నికల ఫలితాలను ప్రకటించేవారు. కానీ ఈ సంవత్సరం చాలా గట్టి పోటీ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉండడంతో చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక కీలక రాష్ట్రాల్లో మెజారిటీ తక్కువ కనుక ఉన్నట్లు అయితే రీ కౌంటింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అలా జరిగినట్లయితే రిజల్ట్ రావడానికి మరి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం అమెరికా అధ్యక్ష ఫలితాలు రావడానికి మునపటి సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.