ఆమెను అనూహ్యంగా పిలిచి పదవి ఇచ్చిన మంత్రి లోకేష్.. !
బిఆర్ నాయుడు కి టీటీడీ చైర్మన్ పదవి దక్కింది. అలాగే ఈసారి మడకశిర నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెస్ రాజుకు కూడా టీటీడీ బోర్డు పదవి దక్కింది. అలాగే జగ్గంపేట నుంచి గెలిచిన పార్టీ సీనియర్ నేత సీనియర్ ఎమ్మెల్యే జ్యోతులను కూడా టీటీడీ బోర్డులో సభ్యత్వం కల్పించారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా మంత్రి నారా లోకేష్ ప్రాతనిత్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళకు కూడా టీటీడీ బోర్డులో సభ్యత్వం దక్కింది. ఆమె ఎవరో కాదు బీసీల్లో బలమైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తమ్మిశెట్టి జానకి దేవి.
ఈ కుటుంబానికి మంగళగిరి నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గతంలో ఆమె బిజెపి నుంచి మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2009లో కూడా ఆమె ప్రజారాజ్యం నుంచి మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అయితే రెండో స్థానంలో నిలవడం విశేషం. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన జానకి దేవికి కుటుంబ నేపథ్యంతో పాటు.. మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడంతో వారు ఎలాంటి పదవులు ఆశించకపోయినా.. లోకేష్ స్వయంగా ఆమెను టీటీడీ బోర్డు మెంబర్గా ఎంపిక చేశారు. ఇది నియోజకవర్గంలో.. పద్మశాలిలలో.. తెలుగుదేశం పార్టీకి మరింత క్రేజ్ రావడానికి కారణమైందని చెప్పాలి.