ఎన్నికల ఫలితాలపై కమలా హారిస్ రియాక్షన్ ఇదే.. పోరాటం విలువైనదే అంటూ?

Reddy P Rajasekhar
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కమలా హారిస్ చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫలితాలను తాను అంగీకరిస్తున్నాను కానీ పోరాటం మాత్రం అపనని తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీ వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం ఆకట్టుకుంటోంది. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందని కమలా హారిస్ అన్నారు.
 
అయితే దేశం కొరకు చేసే పోరాటం ఎప్పుడూ విలువైనదేనని ఆమె చెప్పుకొచ్చారు. ఇది ఆశించిన ఫలితం కాదని దీని కోసం మనం పోరాడలేదని కానీ ఈ ఫలితాన్ని మనం అంగీకరించాల్సిందే అని ఆమె కామెంట్లు చేశారు. ఎన్నికల్లో పోటీ పడిన తీరుపై గర్వంగా ఉందని కమలా హారిస్ చెప్పుకొచ్చారు. దేశం విషయంలో ప్రేమ, సంకల్పంతో పాటు మీరు నాపై ఉంచిన నమ్మకంతో నా హృదయం నిండిపోయిందని కమలా హారిస్ అన్నారు.
 
ప్రజల స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం నా పోరాటం కొనసాగుతుందని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధపాలన, సమాన న్యాయం కొరకు పోరుబాటను ఎప్పటికీ వీడనని కమలా హారిస్ చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు సమయం పడుతుందని దానర్థం గెలవలేమని కాదని ఆమె తెలిపారు. మద్దతుదారులను ఉద్దేశించి కమలా హారిస్ ఈ కామెంట్స్ చేశారు.
 
ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశానని ఆమె తెలిపారు. అధికార మార్పిడి శాంతియుతంగా సాగేలా ఆయనకు, ఆయన బృందానికి సహాయం చేస్తామని చెప్పామని కమలా హారిస్ పేర్కొన్నారు. అమెరికాలో రాజ్యాంగానికి, మనస్సాక్షికి, దేవుడికి విధేయత చ్గూపుతారని ఆమె చెప్పుకొచ్చారు. స్వేచ్ఛ, న్యాయం, భవిష్యత్తు కొరకు మళ్లీ నిలబడాల్సిన, నిమగ్నం కావాల్సిన సమయం ఇదేనని కమలా హారిస్ పేర్కొన్నారు. కమలా హారిస్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగ వైరల్ అవుతుండటం గమనార్హం. కమల కామెంట్లపై ట్రంప్ రియాక్ట్ అవుతారేమో చూడాలి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: