విద్యార్థులకు గుడ్ న్యూస్..ఫీరీఎంబర్స్‌మెంట్‌పై లోకేష్ సంచలన ప్రకటన.!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ను కాలేజీల బ్యాంకు‌ అకౌంట్‌లకు నేరుగా బదిలీ చేసే పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.‘చాలామంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశాలపై నన్ను ట్యాగ్ చేసి స్పందించమని అడిగారు. విద్యార్థులు ప్రస్తావించిన అంశాలను నేను నోట్ చేసుకున్నాను. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం. అలాగే సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాల జారీలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కాలేజీలతో కలిసి పనిచేస్తుంది. ఏపీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నాం. విద్యార్థులకు మా పూర్తి సహకారం, మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని లోకేష్ పోస్ట్ చేశారు.2019కు ముందు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీల యజమాన్యాలకు జమ చేసే పద్ధతి అమల్లో ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బుల్ని విద్యార్థుల తల్లులల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేసే విధానాన్ని అమలు చేశారు.

ఈ డబ్బులు తల్లుల ఖాతాలకు జమ కావడంతో కాలేజీల యాజమాన్యాలు కొంత గడువు ఇచ్చి ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడంతో ఇబ్బందిపడ్డారు. కొంతమంది విద్యార్థులు ఫీజులు సకాలంలో కట్టలేక పరీక్షలు కూడా రాయలేకపోయారు. అంతేకాదు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కలిపి రూ.3,500 కోట్లకుపైగా బకాయిలు ఉంచారు. ఈ పరిణామాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కాలేజీల అకౌంట్‌లకు జమ చేయనుంది.మరోవైపు  ''ఉన్నత విద్యా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించన లోకేష్ విద్యాదీవెన, వసతిదీవెన కింద వైకాపా ప్రభుత్వం రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. విద్యాసంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని సూచించారు.యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపు, కరిక్యులమ్‌లో మార్పులు, విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు, ప్రభుత్వ, డిగ్రీ జూనియర్ కళాశాలల్లో ప్రాథమిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా వినియోగంపై సమీక్షించాను'' అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: