జమిలి ఎన్నికలు: కూటమి తప్పులు.. వైసీపీకి బూస్ట్..!
అంతేకాకుండా వీటికి తోడు టార్గెట్ చేసి మరి వైసీపీ నేతల మీద కేసులు పెట్టడం వల్ల వైసీపీ పార్టీ నేతలకు కూడా కాస్త కోపాన్ని తెప్పిస్తూ ఉన్నాయి. గతంలో వైసిపి చేసిన కొన్ని తప్పులను ఇప్పుడు మళ్ళీ టిడిపి కూటమి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నినాదం అయితే ఇప్పుడు వైసీపీకి మళ్ళీ జీవోత్సవాన్ని పోసేలా కనిపిస్తోందట. చల్లచెదురు అయిన లీడర్లు సైతం ఇప్పుడు మళ్లీ పార్టీలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఎన్నికలు అంటే ఐదేళ్ల అన్నవాళ్ళు ఇప్పుడు మూడేళ్లకే మళ్లీ ఎన్నికలు వస్తాయని.. అందులో కూడా మరో ఆరు నెలలు పూర్తి అయ్యింది కనుక ఇప్పుడు నుంచే ఫీల్డ్ లోకి దిగాలని భావిస్తున్నారు వైసీపీ నేతలు.
అందుకే చాలామంది వైసిపి నేతలు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఇతర పార్టీలోకి చేరినప్పటికీ అక్కడ కూడా చాలా అవమానాలు అవస్థలు పడుతూ ఉన్నారు. వారిని చూసిన తర్వాత చాలామంది నేతలు వైసిపి పార్టీలోనే ఉంటామంటూ తెగేసి చెబుతున్నారట. జమిలి ఎన్నికల విషయంలో కేంద్రం కూడా చాలా గట్టిగానే ఉండడంతో.. ఈ ఎన్నికలు వైసిపి పార్టీకి కలిసి వస్తుందని నమ్మకం ఉన్నది. మరి ఈ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయో ఇవన్నీ ఎదుర్కొని మరి నిలబడి నేతలు ఎవరో చూడాలి. మొత్తానికి జమిలి ఎన్నికలు వైసీపీకి బూస్ట్ ఇస్తున్నాయి.