జగన్ మోసం వల్లే వాలంటీర్లకు అన్యాయం.. పవన్ కామెంట్లలో వాస్తవాలివే!

Reddy P Rajasekhar
గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల విషయంలో ఒకింత గందరగోళం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే వాలంటీర్ల గురించి తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఒకింత సంచలనం అవుతున్నాయి. పవన్ మాట్లాడుతూ సర్పంచ్ లు ప్రథమ పౌరులని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్ లకు గౌరవం ఇవ్వాలని తెలిపారు.
 
పంచాయితీలకు నిధులు ఇవ్వాలని ఆయన కామెంట్లు చేశారు. పంచాయతీ సంస్థలు స్వయం పోషకాలు కావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ నిధులు నేరుగా పంచాయతీల ఖాతాలలోకి వెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు. వాలంటీర్లు సమాంతర వ్యవస్థగా మారినట్టు చాలామంది తన దృష్టికి తెచ్చారని పవన్ పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థను పంచాయితీలలో విలీనం చేయాలని కోరుతున్నామని పవన్ కామెంట్లు చేశారు.
 
జగన్ సర్కార్ వాలంటీర్లకు మోసగించిందని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు వాళ్ల జీతాలను పెంచాలని అనుకుంటున్నా జీవోలలో ఎక్కడా వాళ్ల ప్రస్తావన లేదని పవన్ పేర్కొన్నారు. వాలంటీర్లను గత ప్రభుత్వం మోసం చేసిందని జనాల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయడానికి ఆయన ఉన్నారా అని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.
 
వాలంటీర్లకు తమ ప్రభుత్వం మంచి చేయాలని భావిస్తున్నా జగన్ చేసిన మోసం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని పవన్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ నేతగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామ, వార్డ్ వాలంటీర్లు పవన్ కళ్యాణ్ కామెంట్లపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే పవన్ కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కామెంట్లలో అర్ధ సత్యాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తలచుకుంటే గ్రామ, వార్డ్ వాలంటీర్లకు పూర్వ వైభవం రావడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీ సర్కార్ వాలంటీర్ల విషయంలో దయ, కరుణతో వ్యవహరించాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: