కూటమి సర్కార్ కి మద్దతు తెలిపిన షర్మిల! జగన్ కి మళ్ళీ కోపం తెప్పిస్తున్నారు గా?
అంతే కాదు తాను వైఎస్సార్ కి పుట్టలేదని ప్రచారం కూడా చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రశ్నించే మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టి రాక్షసానందం పొందారని ఆమె ఘాటు విమర్శలే చేశారు. ఇలా సోషల్ మీడియాలో సైకోల బాధితులలో తాను కూడా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సైకోల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
2014 నుంచి 2019 దాకా వైసీపీ తరఫున నాయకురాలిగా ఉన్న షర్మిల విషయంలో నాడు టీడీపీ వారు అనుచితమైన పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు బాధితురాలుగా ఉన్నా కూడా చర్యలు తీసుకునేలా కఠిన చట్టాలు ఉండాలని అంటున్నారు.
రాజకీయాల్లో కానీ ఏ రంగంలో కానీ భిన్న అభిప్రాయాలకు మంచి భాష ఉంటుందని దానిని అందరూ వాడేలా ఉండాలని అంటున్నారు. సో ఇకనైనా అంతా ఆ దిశగా వ్యవహరించేలా చూడాల్సి ఉంది. మొత్తానికి చూస్తే షర్మిలను బాధపెట్టిన రవీంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. మరింతమంది ఆడబిడ్డలను బాధపెట్టిన వారిని కూడా అరెస్టులు చేస్తే కూటమి సర్కార్ ని శభాష్ అని అంతా అంటారు అని అంటున్నారు.