కూట‌మి తొలి పంచాయితీ... జ‌న‌సేన ఎమ్మెల్యే VS టీడీపీ ఇన్‌చార్జ్‌...!

RAMAKRISHNA S.S.
- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . .

ఉత్తరాంధ్ర లోని నెల్లిమ‌ర్ల‌ నియోజకవర్గంలో టిడిపి కూటమి లో కుంపట్లు రాజుకున్నాయి. ఇక్కడ జనసేన - టిడిపి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. ఒకరి కూడా మరొకరికి ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే పరిస్థితి ఉంది. ఇది అంతకంతకు పెరిగి అక్కడ కూటమి రెండుగా చీలిపోయింది. నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు. టిడిపి ఇన్చార్జిగా కర్రోతు బంగారు రాజు ఉన్నారు. వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. టిడిపిని తొక్కు ప‌ట్టి .. వైసిపి నేతలకు ఉపాధి హామీ పనులు జనసేన ఎమ్మెల్యే అప్పగించారని తెలుగు త‌మ్ముళ్ల ఆరోప‌ణ‌. టిడిపి నేతల ఆధిపత్యం స‌హించ‌న‌ని ఎమ్మెల్యే చెపుతోన్న మాట‌. ఇలా ఆరోపణల ప‌ర‌పంర ఇక్క‌డ కొన‌సాగుతోంది.

నెల్లిమర్లలో కూటమి రాజకీయంతో జనసేన ఎమ్మెల్యే ... టిడిపి ఇన్‌ఛార్జ్ లు ఇద్ద‌రిని ఇప్పటికే రెండు పార్టీల ముఖ్య నేతలు అమరావతికి పిలిపించి ఇద్దరితోను విడివిడిగా చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా ఐక్యంగా ఉందని .. ఎక్కడెక్కడ నేతలు కలిసి పని చేస్తున్నారని .. మీ ఇద్దరు కూడా నియోజకవర్గంలో కలిసి పని చేసుకోవాలని సూచించారు. కూట‌మి లో ఐక్యత చాలా ముఖ్యమని .. టిడిపి - జనసేన అధినాయకత్వాలు ఈ ఇద్దరికీ సూచించాయి. అలాగే కూటమి ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని కూడా ఇద్దరికీ సున్నితంగా హెచ్చరించారని సమాచారం.

ఇక లోకం మాధవి - బంగార్రాజు మధ్య మరోసారి కూడా అమరావతిలో చర్చ‌లు ఉంటాయని తెలుస్తోంది. ఏపీలో కేవలం నెల్లిమర్లలో మాత్రమే కాదు పలు నియోజకవర్గాలలో ఇదే తరహాలో కూటమి నేతల మధ్య చిచ్చు రాజుకుంటుంది. ఈ పరిస్థితి మారకపోతే దాదాపు ప్రతిరోజు ప్రతినెల చాలా నియోజకవర్గాలలో రెండు పార్టీల నేతల మధ్య పంచాయతీలు తప్పేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: