ఏపీ: కూటమి ప్రభుత్వంపై..డిప్యూటీ సీఎం మరో సంచలన ట్వీట్..!
గత కొంతకాలం క్రితం విశాఖపట్టణం పోర్టులో షిప్‌మెంట్‌ను సైతం స్వాధీనం చేసుకున్నామని దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్ కు విజయవాడలో ఒక బడా వ్యాపారవేత్తతో సంబంధాలు ఉన్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయనీ.. గత పాలన డ్రగ్ మాఫియా చాలా అభివృద్ధి చెందిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకే సమగ్ర చర్యలు ప్రణాళికలు సైతం తీసుకుంటున్నామంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.. గంజాయి మాదక ద్రవ్యాల పైన ఉక్కు పాదం మోపెందుకే రాష్ట్రంలో యాంటీ నార్కోటి ట్రాన్స్పోర్ట్ ప్రతి జిల్లాకి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నామంటూ తెలిపారు.
మొత్తం 26 నార్కోటిక్ కంట్రోల్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నామంటూ మంత్రివర్గ ఉప సంఘం కూడా ఆమోదం తెలిపింది అంటూ తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..డీజీపీ పర్యావేక్షణలో ఐజి స్థాయి అధికారిని ప్రభుత్వంలో వీరంతా పనిచేస్తారని తెలిపారు. కూటమిలో భాగంగా డ్రగ్స్ పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కూటమి ప్రభుత్వానీకి సవాల్‌గా మారింది. మరి ఏ మేరకు గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి వీటిని అరికడుతుందో చూడాలి మరి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గత నెల నుంచి ఎక్కువగా దృష్టి పాలన పైన పెట్టినట్టుగా కనిపిస్తోంది.