జగన్‌తో పోలిస్తే బాబే మేలు.. రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ఏకంగా ఇంత లాభమా?

Reddy P Rajasekhar
2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఉన్నారు. అయితే జగన్ సీఎంగా ఉన్న సమయంలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు రేషన్ బియ్యం మినహా ఇతర సరుకులు సక్రమంగా అందలేదు. అడపాదడపా కందిపప్పును పంపిణీ చేసినా మెజారిటీ సందర్భాల్లో ప్రజలకు సరుకులు అందలేదు. అయితే జగన్‌తో పోలిస్తే బాబే మేలు అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
చంద్రబాబు ప్రజలకు రేషన్ బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర సక్రమంగా అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలలో జొన్నలు సైతం పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన పాలన అందించే విషయంలో చంద్రబాబు నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరిగేలా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి సరైన చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు చేసే వాళ్ల విషయంలో సైతం ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
 
ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ఆయన పాలన అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏడు పదుల వయస్సులో సైతం ఎంతో కష్టపడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. చంద్రబాబు విజన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏపీ సీఎం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, పవన్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: