ఆ హీరోయిన్ నా రోల్ మోడల్.. షాకింగ్ విషయం చెప్పిన సమంత?
అయితే ఆ తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి ఇక పెళ్లి కూడా చేసుకుంది. కానీ వీరి వైవాహిక బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని వేరుపడ్డారు. ఇక ఇప్పుడు ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా విడాకుల బాధలో ఉన్న సమయంలోనే సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది. ఎంతో కష్టపడి ఈ వ్యాధి నుంచి బయటపడగలిగింది అన్న విషయం తెలిసిందే. ఇలా సమంత ఎదుర్కొన ఒడిదుడుకులు చూసి ఆమెను ఇతర హీరోయిన్లు రోల్ మోడల్ గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఎన్ని కష్టాలు వచ్చినా దృఢంగా నిలబడాలి అనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు.
ఇలా ఎంతోమంది నటీమణులకు రోల్ మోడల్ గా నిలిచిన సమంతకు మరో హీరోయిన్ రోల్ మోడల్ అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని సమంత ఇటీవలే వెల్లడించింది. ప్రియాంక చోప్రా తనకు రోల్ మోడల్ అని నటి సమంత చెప్పుకొచ్చింది. బిజినెస్ టుడే నిర్వహించిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ కార్యక్రమంలో సమంత మాట్లాడింది. సీట్ ఆడిల్ తొలి సిరీస్ అమెరికాలో రెండోది ఇటలీలో మూడోది భారత్లో తర్వాత మిక్సీకోలో జరుగుతుంటుంది అంటూ చెప్పుకొచ్చింది సమంత. అమెరికాలో జరిగే సిరీస్లో ప్రియాంక నటించగా ఇండియాలో జరిగే సీజన్లో నేను నటించాను. ప్రియాంక ఒక మోడల్. ఆమె నుండి ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.