కేసులు ఎదుర్కొన్న పట్టాభికి ఇలాంటి పదవా.. బాబు నిర్ణయాన్ని మార్చుకుంటారా?

Reddy P Rajasekhar
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పదవులు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. కూటమి సర్కార్ తాజాగా రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ దిశగా అడుగులు వేసింది. రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా మొత్తం 59 మంది పేర్లతో జాబితా విడుదలైంది. రెండో జాబితాలో నలుగురు అధికార ప్రతినిధులకు చోటు దక్కింది.
 
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పలు సందర్భాల్లో జైలుకు వెళ్లొచ్చిన పట్టాభికి స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఛైర్మన్ పదవి లభించింది. అయితే ఈ పదవి ప్రాధాన్యత ఉన్న పదవి కాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గతంలో బాబు, లోకేశ్ నుంచి మంచి పదవి ఇస్తామని హామీ లభించగా ఇప్పుడు దక్కిన పదవి విషయంలో పట్టాభికి సంతృప్తికి అయితే లేదని తెలుస్తోంది.
 
పట్టాభి అసంతృప్తి నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. వాస్తవానికి తొలి దశ నామినేటెడ్ పోస్టుల భర్తీలోనే పట్టాభికి పదవి దక్కుతుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. ఈ పదవి వల్ల పట్టాభికి ఒరిగేం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పట్టాభి ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
 
కూటమి సర్కార్ పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడిన మరి కొందరు నేతలకు సైతం బాబు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు మరింత మేలు జరిగేలా కూటమి వ్యవహరిస్తుందేమో చూడాల్సి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు  ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతో ముందుచూపుతో నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: