ఏపీ: సీఎం చంద్రబాబుపై.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పై మరొకసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధినేత ఫైర్ కావడం జరిగింది.. ముఖ్యంగా ప్రజలను మాయ చేసి మోసం చేస్తున్నారంటూ మరొకసారి ఫైర్ అయ్యారు.ఏపీ ప్రభుత్వం నిర్ణయాల పైన ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది.. కూటమి ప్రభుత్వం పైన ఫైర్ అవుతూ.. ప్రజలను మభ్య పెట్టేందుకు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తున్నారని ఇటీవలె విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సి-ప్లేస్ ద్వారా పర్యటన చేపట్టారు.. సెల్ఫోన్ ,కంప్యూటర్ని కూడా తానే కనిపెట్టారని రెండు దశాబ్దాలుగా కబుర్లు అయితే చెబుతున్నారు. ఇప్పుడు సి-ప్లేస్ మీద కూడా కహానీలు మొదలు పెట్టారంటూ వెల్లడించారు.

సి-ప్లేస్ నడిపితే రాష్ట్రం అభివృద్ధి అయిపోతుందా చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా డప్పులు చూస్తూ ఉంటే పిట్టలదొర డైలాగులు గుర్తుకు వస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు.. ఒకవైపు గత ప్రభుత్వం నిర్మించిన పోర్టులను ప్రైవేటీకరణం చేస్తూ అలాగే మెడికల్ కాలేజీలు, ఎన్నో స్కాములు చేస్తూ ఉన్న తన మనసులను పట్టించుకోలేదని వీటి మీద ప్రజలలో చర్చ జరగకూడదని ఇప్పుడు సీ-ప్లేసులో అభివృద్ధి జరిగిపోతున్నట్లు పబ్లిసిటీ ఇస్తున్నారంటు తెలిపారు.

సి-ప్లేస్ అన్నది ఇప్పుడు ఇదే కాదు 114 ఏళ్ల క్రితమే 1910 లో నడిచింది అంటూ తెలియజేశారు.. ఇలాంటి వాటిని మళ్లీ ఇప్పుడు ఎల్లో మీడియా చంద్రబాబు గొప్పగా డబ్బు కొట్టుకుంటున్నారని ప్రశ్నించారు.. సంపద సృష్టించాలి అంటే సి-ప్లేస్ మీద పబ్లిక్ సిటీ కాదని ఎద్దేవా చేశారు మాజీ సీఎం జగన్..మీరు మీ పార్టీ నాయకుల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా మలుస్తున్నారని మీ మనసులు ఆస్తులు కూడా పెడితే అది ప్రజలకు సంపదగా అవుతుందా అంటూ ప్రశ్నించారు.. ఒకవేళ మీ దృష్టిలో ఇదే సంపద అభివృద్ధి అంటే ఇదేనేమో అన్నట్లుగా ఫైర్ అయ్యారు. మీరు చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యలను ప్రజలు తప్పకుండా నిలదీస్తారంటూ ఫైర్ అయ్యారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: