ఏపీ బడ్జెట్: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ పై కీలక ప్రకటన..!
రైతులకు సైతం సంక్షేమ పథకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని అందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ అచ్చెమనాయుడు తెలియజేశారు. రైతులు పండించే పంటలకు సైతం గిట్టుబాటు ధరలు కూడా కల్పిస్తామంటూ వెల్లడించారు.. అలాగే తుఫానులు వరదల వల్ల నష్టపోయిన రైతులకు సైతం తమ ప్రభుత్వం కూడా అండగానే ఉంటుంది అంటూ అచ్చెమనాయుడు భరోసా ఇవ్వడం జరిగింది. రైతుల కోసం విత్తనాల రాయితీ కోసం 240 కోట్లు కేటాయించామని అలాగే భూసార పరీక్షల కోసం 38.88 కోట్ల కేటాయించామని తెలిపారు.
అన్నదాత సుఖీభవకు రూ 4500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు అచ్చెమనాయుడు తెలియజేశారు. రైతు సేవ కేంద్రాలకు కోసం అలాగే ఇతరత్రా వాటికోసం కొన్ని కోట్ల రూపాయలను కూడా కేటాయించామని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమనాయుడు. ప్రతి ఏడాది కూడా రూ .20వేల రూపాయలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇందులో పిఎం కిసాన్ కింద రూ .6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే మిగిలిన డబ్బులను కూటమి ప్రభుత్వం ఇస్తుంది అని తెలియజేశారు. అన్నదాత సుఖీభవకి త్వరలోనే మార్గదర్శకాలు పైన కూడా ఆదేశాలను జారీ చేస్తామంటూ తెలిపారు. మరి ఎప్పుడు రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తారని విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.