కేసీఆర్‌ ఫాంహౌజుకు అక్కినేని ఫ్యామిలీ ?

Veldandi Saikiran
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. మాజీ మంత్రి కేసీఆర్ ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లో నివాసం ఉంటున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మాజీ మంత్రి కేసీఆర్ ఉంటున్న ఈ ఫామ్ హౌస్ కు అక్కినేని కుటుంబ సభ్యులు వెళ్లారని ఓ వార్త వైరల్ అవుతుంది. వారు అక్కడికి వెళ్లడానికి గల కారణం ఏంటని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో అక్కినేని కుటుంబంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.

నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున, నాగ చైతన్య ఇద్దరు కలిసి సమంతను కేటీఆర్ వద్దకు పంపే ప్రయత్నం చేశారని దానికి సమంత నిరాకరించిందని కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. అలా చేసినందుకే సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చారంటూ కొండా సురేఖ అన్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకుంటున్నాడని కొండా సురేఖ అన్నారు.

హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడంటూ కొండా సురేఖ ఆరోపణలు చేశారు. ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని బయటపడింది. కాగా, అక్కినేని కుటుంబం కొండా సురేఖపై కోర్టులో 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడడానికే అక్కినేని కుటుంబం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లినట్లుగా కొంత మంది ప్రచారాలు చేస్తున్నారు.

ఇక మరికొందరు ఏమో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన కారణంగా ఆ విషయం గురించి మాట్లాడడానికి వెళ్లాడని మరికొంతమంది అంటున్నారు. ఇక అక్కినేని కుటుంబం కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఏ విషయం గురించి మాట్లాడడానికి వెళ్లారనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించి తెగ ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ప్రచారాలలో ఏమేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: