ఏపీ: అత్యంత దారుణం..మరో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం..!
ఇప్పుడు తాజాగా నంద్యాల జిల్లాలోని కులుములపల్లి గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకున్నదట. ఏడేళ్ల చిన్నారి పైన ఒక దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే బయట ఆడుకుంటున్నటువంటి చిన్నారి పై.. ఎల్లమ్మ అనే వ్యక్తి ఈ ఆగాయిత్యానికి పాల్పడినట్లుగా సమాచారం.ఈ చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ చిన్నారి కూడా కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి నిందితుడనీ పట్టుకుందామనుకునే లోపు అక్కడి నుంచి పరారయ్యారట.
వెంటనే అక్కడ స్థానికులు సైతం ఆ చిన్నారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నిందితుడు పైన ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరి ఈ విషయం మీద అటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి. ఇప్పటికే కూటం ప్రభుత్వం పైన వైసిపి నేతలతో పాటు ప్రజలు కూడా ఈ అత్యాచారాల సంఘటనల పైన విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళల పైన జరుగుతున్న విషయాలపైన ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇటీవలే ఇలాంటి వారిని నడిరోడ్లు శిక్షించాలి అంటూ తెలియజేయడమే కాకుండా ఇలాంటివి ఎవరు చేసినా కూడా సహించము అంటూ తెలిపారు. మరి ఇప్పుడు జరిగిన ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.