ఏపీ: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఏకంగా వారికి రూ.6 వేలు..?
ఇలాంటి సమయంలోనే విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఆరువేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు అందుకు తగ్గ నిర్ణయాలను కూడా తీసుకున్నదట. అయితే విద్యార్థులు తమ నివాసానికి దూరంగా ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. ఈ ఆరువేల రూపాయలు విద్యార్థుల ట్రావెల్ అలవెన్స్ అన్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే సీఎం చంద్రబాబు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా 13.53 కోట్ల రూపాయల డబ్బులను కూడా రిలీజ్ చేశారట. సమగ్ర శిక్ష అభిమాన్ కింద ఈ ఉత్తర్వులను కూడా జారీ చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 22 వేల మందికి పైగా ఈ లబ్ధి పొందబోతున్నారట. అంటే ఒక్కో విద్యార్థికి 6000 చొప్పున ఇవ్వగా వారికి ఆర్థిక సహాయం కింద ఇది అందుతుందని తెలియజేస్తున్నారు. అయితే విద్యా హక్కు చట్టం కింద ఒక కిలోమీటర్, మూడు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలతో పాటు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మాత్రమే ఇవి వర్తిస్తాయట. మొత్తానికి విద్యార్థులకైతే ట్రావెల్ అలవెన్స్ కింద 6000 ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.