సారీ చెప్పినా శ్రీ రెడ్డిని వదలడం లేదు గా?

Chakravarthi Kalyan
తెలుగులో వివాదాస్పద సినీ నటి, యూట్యూబర్ శ్రీరెడ్డి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నట్టు కనిపిస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ వైఎస్ వీరాభిమాని చెలరేగిపోయి లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నాగబాబు లాంటి ప్రముఖులపై నోటికి వచ్చినట్టు బూతుల పర్వం కొనసాగించింది.


అయితే గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో పోస్టుల పెట్టిన వారిని అరెస్ట్ చేస్తుండటం సంచలనం రేపుతున్నది. ఈ అరెస్టుల పర్వంలో శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ లాంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేస్తున్నారు.  జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో శ్రీరెడ్డి ఎంతలా చెలరేగిపోయిందనే విషయం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.  టీడీపీ, జనసేన అధికారంలోకి రాదనే అత్యుత్సాహంతో మాటల్లో చెప్పలేని విధంగా తన వీడియోలతో దూషించింది.  ఇదంతా వైసీపీ సోషల్ మీడియాకు అధినేతగా వ్యవహరించిన నేత డైరెక్షన్‌లోనే శ్రీరెడ్డి యాక్టింగ్ చేసిందని ఇటీవల ఓ పోలీస్ ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటమే కాకుండా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. దాంతో శ్రీరెడ్డికి వాస్తవం గుర్తుకు వచ్చింది. దాంతో తాను చేసిన తప్పును సరిద్దిద్దుకొనే ప్రయత్నం చేసింది. ఆ విధంగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.


శ్రీరెడ్డి వీడియో రిలీజ్ చేసి.. లోకేష్ గారూ, మీకు మీ అమ్మగారికి, మీ భార్యకు సారీ.  హోంమంత్రి అనిత గారికి, పవన్ కల్యాణ్ గారికి, మీ కుటుంబ సభ్యులకు సారీ. నాకు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని నా వల్ల నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని ఈ నిర్ణయం తీసుకొన్నాను అని శ్రీరెడ్డి అన్నారు.  నా తలవంచి నమస్కరిస్తూ అడుగుతున్నాను. నన్ను, నా కార్యకర్తలను వదిలిపెట్టండి. నన్ను కూడా క్షమించండి అంటూ వీడియోను ముగించారు.


అయితే, క్షమించమని వేడుకొన్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కనికరం చూపలేదనే సంకేతాలు వచ్చేశాయి. శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే సోషల్ మీడియాలో తమ కుటుంబాన్ని తీవ్రంగా వేధించినందుకు గాను లోకేష్ సీరియస్‌గా ఉన్నారు. ఆయన ఈ విషయంలో ఎవరినీ క్షమించబోరని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. అయితే శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ విషయంలో ఏం జరుగుతుందో అనేది అందరిలోను ఆసక్తిని రేపుతున్నది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: