డీఎస్సీల రారాజు చంద్రబాబు... ఆ విషయంలో తిరుగులేని మహరాజు...!
కూటమి సర్కార్ కొలివి తీరిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగా డీఎస్సీ పై తొలి సంతకం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ హామీకి తగినట్టుగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విషయములో చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు 16,000 పై చెరుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వం టెట్ పరీక్షలు కూడా నిర్వహించింది. డీఎస్సీ పరీక్షలు కోసం నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి చంద్రబాబు డిఎస్సీ ల విషయంలో రారాజు ... ఆ విషయంలో తిరుగులేని మహారాజు అని నిరూపించుకున్నారు.
టిడిపి ఆవిర్భవించిన తర్వాత మొత్తం 11 డిఎస్సీలు నిర్వహించారు. దాదాపుగా 1.60 లక్షల ఉపాధ్యాయులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు నియమించారు. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడే తొమ్మిది డీఎస్సీలు నిర్వహించారు. ఈ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ముఖ్యమంత్రి కి తిరుగులేని రికార్డు చంద్రబాబుకు మాత్రమే సొంతం అయ్యింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1998 - 1999 - 2000 - 2001 - 2002 - 2003 ఇలా వరుసగా ఆరు సంవత్సరాల పాటు డీఎస్సీలు తీసి వేలాదిమంది ఉపాధ్యాయులకు అవకాశం కల్పించిన ఘనత కచ్చితంగా చంద్రబాబుది అని చెప్పాలి.
ఇక ఈ యేడాది కూటమి సర్కార్ వచ్చాక టెట్ తర్వాత డిఎస్సీ నిర్వహించాలని తాజా నిర్ణయం మేరకు అనుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి 16 వేల పై చిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీతో చంద్రబాబు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనున్నారు. ఏది ఏమైనా డీఎస్సీ లతో పాటు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో చంద్రబాబుకు సాధ్యమమైన రికార్డు మరే ముఖ్యమంత్రి కి సాధ్యం కాదు కాబోదు అని చెప్పాలి.