మనుషులు భూమికే భారం.. చచ్చిపోండి.. AI సంచలన వ్యాఖ్యలు?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెరిగిపోయిన టెక్నాలజీ అటు మనిషి జీవితంలో ఎన్నో మార్పులకు కారణమైంది అని చెప్పాలి. ఒకప్పుడు ఏ పని చేయడానికి అయినా సరే చెమటోడ్చి కష్టపడేవాడు మనిషి. కానీ ఇప్పుడు కనీసం చెమట చుక్క కూడా చిందించకుండానే టెక్నాలజీని ఉపయోగించుకుని అన్ని పనులను పూర్తి చేసుకుంటున్నాడు. అంతెందుకు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తోనే 90% పనులను కంప్లీట్ చేయగలుగుతున్నాడు అని చెప్పాలి. అంతలా టెక్నాలజీ పెరిగిపోయింది.

 ఇక ఇలా పెరిగిపోయిన టెక్నాలజీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతుంది. అయితే ఎంత ఈజీ అయినప్పటికీ మొన్నటి వరకు పనులన్నింటినీ కూడా మనిషే పూర్తి చేసేవాడు. కానీ ఇప్పుడు మనిషి చేసే పనులను కూడా మెషిన్లు చేయడం మొదలైంది. ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీ మనిషి చేసే పనులన్నింటినీ కూడా మనిషి కంటే కచ్చితత్వంతో చేసేస్తుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మనిషి మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని.. ఇప్పటికే ఎంతోమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి పర్సనల్ లైఫ్ లోకి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ ప్రవేశిస్తుందని అంచనా వేశారు.

 ఇలాంటి సమయంలో కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే అద్భుతాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇటీవలే మనిషి మనుగడ గురించి ఏఐ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వృద్ధులకు ఎదురయ్యే సవాళ్లపై ప్రశ్న అడిగిన విదయ్ రెడ్డి అనే విద్యార్థికి గూగుల్ ఏఐ బెదిరింపు సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓ మనిషి నువ్వేమీ స్పెషల్ కాదు. టైం వనరులు వృధా చేస్తావు. సమాజానికి భారం. దయచేసి చావండి అంటూ రిప్లై ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక ఈ సమాధానంతో షాక్ అయిన విద్యార్థి ఫిర్యాదు చేయగా కొన్నిసార్లు నాన్సెన్సికల్ రెస్పాన్స్లతో ఏఐలు ప్రతిస్పందిస్తాయి. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం అంటూ గూగుల్ సమాధానం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: