ఏడాది పాలనలో రేవంత్ ఏం సాధించారు అంటే..?
ఇక హైద్రాబాద్ కు పూర్వ వైభవం అంటూ హైడ్రా, మూసీకి సుందరీకరణ అంటూ కూల్చివేతలకు శ్రీకారం చుట్టి మన్ననలు పొందారు. మొదట సెలబ్రెటీ అయిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసి వైకుంఠ పాళిలో నిచ్చెన ఎక్కారు. హైడ్రా కూల్చివేతలు ఎక్కువవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి వచ్చింది. దీంతో పాటు గ్రూప్ 2 ఉద్యోగార్థుల నుంచి నిరసనలు పెరగడం, వారిపై పోలీసుల వ్యవహారం కూడా ప్రభుత్వం మెడకు చుట్టుకొని మళ్లీ కిందికి పడిపోయారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయినా హైద్రాబాద్ బ్రాండ్ వాల్యూను పైస్థాయికి తీసుకువెళ్లే కంపెనీలను రాష్ట్రానికి తీసుకురాలేకపోయింది అనే వాదన కనిపిస్తుంది.
బీఆర్ఎస్ అవినీతిని బయటపెడతామని వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చిన రేవంత్ ప్రకటనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. కొందరు మంత్రులు చేసిన అసభ్యకర ప్రకటనలను సీఎం ఖండించకపోవడం ఒక వర్గంలో వ్యతిరేకతకు కారణమైంది. ఒక్కోసారి దూకుడుతో ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేసి వారిని డిఫెన్స్ లో నెట్టగల సమర్థత రేవంత్ వద్ద ఉంది. ఇదే దూకుడు ప్రత్యర్థి చేతికి అస్త్రాలు ఇస్తుంది. రేవంత్ కు వాక్చాతుర్యం, రాజకీయ అనుభవం ఉన్నా.. పాలనా పరంగా అనుభవం లేకపోవడంను చూస్తే రేవంత్ రాజకీయం పైకిలేస్తూ, కిందకు పడుతూ వైకుంఠపాళిని తలపిస్తోంది.